రాజరాజచోర టీజర్‌ విడుదల

 రాజరాజచోర టీజర్‌ విడుదల

భూమిపుత్ర, సినిమా:

విభిన్న కథా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా ఆయన ’రాజ రాజ చోర’ అనే విభిన్న కథా చిత్రాన్ని చేస్తున్నాడు. మేఘా ఆకాశ్‌, సునయన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఎంటర్‌టైనర్‌ ని హసిత్‌ గోలి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్‌ విూడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. దీనికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా కీర్తి చౌదరి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్‌ విడుదల కాగా, ఇది సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. రావణాసురుడు వచ్చెనే అంటూ బ్యాక్‌ గ్రౌండ్‌లో సౌండ్‌ వస్తుండగా, శ్రీ విష్ణు వెరైటీ గెటప్స్‌లో కనిపించడం విశేషం. చిత్రంలో తనికెళ్ళ భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్‌,శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అజయ్‌ ఘోష్‌, వాసు, గంగవ్వ, ఇంటూరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *