ప్రజలు పిట్టల్లా రాలుతున్నా రాజకీయాలేనా!!

 ప్రజలు పిట్టల్లా రాలుతున్నా రాజకీయాలేనా!!

భూమిపుత్ర,సంపాదకీయం:

దేశంలో  కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాల సంఖ్యమాత్రం తగ్గడం లేదు. అధికారికంగా లెక్కలు ఒకలా ఉంటే వాస్తవ గణాంకాలు వేరుగా ఉన్నాయి. వాక్సిన్‌ అందరికీ అందుబాటులో రాలేదు. వ్యాక్సిన్‌ కోసం ప్రజలు ఎగబడాల్సిన దుస్థితి ఏర్పడింది . వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కార్యరూపం దాల్చలేదు. ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు, పడకల విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.హామీలు శుష్క వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయి. ఆక్సిజన్‌ అందక వందలాది మంది మృత్యువాత పదుతున్నారు. కేంద్రాన్ని తప్పుపడుతున్న రాష్ట్రాల పరిస్థితి కూడా నిజాయితీగా లేదు. నిత్యం లక్షల కేసులతో వేలాది మంది మరణాలతో వాస్తవ పరిస్థితులు భయోత్పాతంగా ఉన్నాయి.

అయినా ఈ లెక్కలను లెక్కచేయని ప్రభుత్వాలు కోవిడ్‌ నివారణకు మెరుగైన విధానం అమలు చేస్తున్నామని నిత్యం నిర్లజ్జగా ప్రకటిస్తున్నాయి. సుప్రీంకోర్టు,హైకోర్టు జోక్యం చేసుకుని రోజూ కొరడా ఝళిపిస్తున్నాయి. టీకా విధానంలో అత్యుత్సాహంతో కోర్టులు జోక్యం చేసుకుంటే ఊహించని పరిణామాలు ఎదురు కావచ్చని నేరుగా సర్వోన్నత న్యాయస్థానాన్నే బెదిరించే దుస్థితికి కేంద్ర ప్రభుత్వం దిగజారిపోయింది. మేమంతా చూసుకుంటాం..విూకేం పని అన్న రీతిలో కేంద్రం వ్యవహారంగా ఉంది. దేశవ్యాప్తంగా వైద్యం పడకేసి పడకలు దొరకక, ఆక్సిజన్‌ అందక, టీకాకూ గతిలేక కనీస వైద్య సాయానికి దిక్కులేక అనునిత్యం లక్షలాది మంది కోవిడ్‌ బారినపడుతున్నారు.వేలాదిమంది బలైపోతున్నారు. గాలిలో ప్రాణాలు గాల్లోనే కలుస్తున్నాయి. శ్మశానాల్లోనూ చోటు దక్కక గంగానదీ జలాల్లో కలిసిపోతున్న బతుకులెన్నో!

ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ఇక దేశంలోని ఇతర ప్రాంతాల్లో దుస్థితి ఇంకెంతటి దారుణంగా ఉంటుందో ఊహించవచ్చు. మరోవైపు థర్డ్‌వేవ్‌ అంటున్నారు. ఈ సారి పిల్లలపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాలు కలిసి కట్టుగా సమర్థవంతమైన వ్యూహంతో ముందుకు సాగాలి. కరోనా వేవ్‌ను కట్టడి చేయాలి. ఇకపోతే మే నెలాఖరు నాటికి కూడా తమ కోటా ప్రకారం అందాల్సిన టీకాలు అందే పరిస్థితి లేదు. ఊహించనిరీతిలో దేశంలో సంక్షోభం నెలకొందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదివరకే తీవ్రంగా వ్యాఖ్యానించింది. వ్యాక్సినేషన్‌, ఆక్సిజన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానపర వైఫల్యాలను వివిధ హైకోర్టులు కూడా తీవ్రస్థాయిలో ఎండగట్టాయి.

కోవిడ్‌ రెండో దశలో భారత్‌ అంతులేని సంక్షోభంలో కూరుకుపోయిందని అంతర్జాతీయ విూడియా సంస్థలు ఆగ్రహంతో సంపాదకీయాలు రాశాయి. ఈ సంక్షోభానికి చలించి ప్రపంచ దేశాలు అభయహస్తం అందించాయి. ఇంత జరుగుతున్నా మోడీ సర్కార్‌ మాత్రం తన మొద్దు నిద్ర వీడట్లేదు. ఈ పరిస్థితుల్లోనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి ఆక్సిజన్‌ సరఫరాకు ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ కూడా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో న్యాయవ్యవస్థ జోక్యాన్ని ప్రశ్నిస్తూ మోడీ సర్కార్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. వాస్తవానికి కార్యనిర్వాహక వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం ఎప్పుడూ చర్చనీయాంశమే.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని పాలనా యంత్రాంగం మొత్తం పడకేసింది. ఈ క్రమంలో ప్రజలు ఎవరికి వారు తమ స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇల్లు గుల్ల చేసుకుని, ఆస్తులు అమ్ముకుని అస్పత్రులకు వెళుతున్న ఎందరో శవాలుగా తిరిగి వస్తున్నారు. దిక్కులేని శవాల్లాగా కాటికి పంపిస్తున్నారు. దేశంలో కోవిడ్‌ కేసులు గత వారంతో పోలిస్తే తగ్గుముఖం పట్టడం అత్యంత సంతోష కరమైన పరిణామం. ఏప్రిల్‌ 21 తర్వాత మొట్ట మొదటిసారిగా దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసులు మూడు లక్షలలోపు పడిపోయాయి. దేశంలో కరోనాకేసుల విషయంలో మొదటి అయిదు రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు వైద్య వసతులు లేక ప్రక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి పరుగు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ తెలంగాణ ప్రభుత్వం వీరిని అడ్డుకుని హైకోర్టు మందలింపులతో, హెచ్చరికతో మిన్నకుండి పోయింది.

ఇంతటి దారుణ పరిస్థితుల్లో ఇరు తెలుగు రాష్ట్రా సీఎం లు రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. తెలంగాణ లో బాగా పని చేస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి ఈటెలను తప్పించే పనిలో పడ్డ కెసిఆర్‌ ఇదే అదనుగా ఆయనను తప్పించారు. ఒక వైపు ప్రజలు కరోనాతో అ్లలాడుతూ హాహాకారాలు చేస్తుంటే, సరిహద్దుల్లో అంబులెన్సుల్లో రోగులు ఆర్తనాదాలు ఇద్దరికీ పట్టనట్లు వ్యవహరించారు. అంబులెన్స్‌ల విషయంలో కలిసి మాట్లాడాలన్న ఆలోచన కూడా సీఎం లకు రాలేకపోయింది. తమ వైఫల్యాలనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కక్ష సాధింపు చర్యలకు ప్పాడుతున్న ఇద్దరు కూడా వ్యక్తిగత ఎజెండాకే ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ లో సరైన సమయంలో వైద్య సౌకర్యాలు భించక ఒక గర్భిణీ మరణించడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించడమే కాక రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను తప్పుపట్టింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కూడా కరోనా కంటే రాజకీయ ప్రాధాన్యతలే ముఖ్యం అన్న విషయం రాష్ట్ర ప్రజందరికీ తెలిసిపోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరోనా సెకండ్‌ వేవ్‌లోనూ మౌనంగా ఉన్నారు. బెంగాల్లో నూ రాజకీయాకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా కట్టడికన్నా ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పాలకుల బాధ్యతారాహిత్యంగా ఉన్నా ప్రజలు మాత్రం ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి. ఎవరికి వారు స్వీయరక్షణతో ఉండాలి. లేకుంటా ప్రాణాలు పోతాయి. అయినవారిని కోల్పోతాం. ఆస్తులు కోల్పోతాం. ఇది గుర్తెరిగి ప్రజలు వీధుల్లోకి రాకుండా ఇంటికే పరిమితం కావాలి. అంతా సద్దు మణిగాక అప్పుడు సంపాదన గురించి ఆలోచించాలి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *