సూర్య నూతన చిత్రం పోస్టర్‌ విడుదల

 సూర్య నూతన చిత్రం పోస్టర్‌ విడుదల

భూమిపుత్ర, సినిమా:

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య కత్తిచేతపట్టిన పోస్టర్‌ ని రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించిన ఓపోస్టర్‌ విడుదలై అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. సూరీడు వెలుగుల్లో కత్తిని పట్టుకొని లుంగీలో ఉన్న సూర్య స్టిల్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పాండిరాజ్‌ డైరక్షన్‌ లో తెరకెక్కుతోన్న ఈసినిమాలో సూర్య ఊరమాస్‌ గా కనిపించబోతున్నాడు.
కోలీవుడ్‌ స్టార్‌ సూర్య ఇటీవలే ’సూరారై పొట్రు’ సినిమాతో వచ్చి భారీ హిట్‌ అందుకున్నాడు. తెలుగులో ఈ సినిమా ’ఆకాశం నీ హద్దురా’ పేరుతో డబ్బింగ్‌ వెర్షన్‌ రిలీజ్‌ చేయగా తెలజగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. లేడీ స్టార్‌ డైరెక్టర్‌ సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎయిర్‌ దక్కన్‌ వ్యవస్థాపకుడు కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా ..కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో చాలా కాలం తర్వాత భారీ కమర్షియల్‌ హిట్‌ అందుకొని ఫాంలోకి వచ్చిన సూర్య తర్వాతి సినిమాని రీసెంట్‌గా సెట్స్‌ విూదకి తీసుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య కెరీర్‌లో40 వ సినిమాగా రూపొందనుండగా పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ’గ్యాంగ్‌ లీడర్‌’, ’శ్రీకారం’ సినిమాతో టాలీవుడ్‌లో బాగా పేరు తెచ్చుకున్న యంగ్‌ బ్యూటీ ప్రియాంక అరుల్‌ మోహన్‌ సూర్యకి జంటగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు పాండిరాజ్‌ సామాజిక అంశాలతో సూర్య ఇమేజ్‌కి ఏమాత్రం తగ్గకుండా మాస్‌ యాక్షన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ సాగుతున్న ఈ సినిమా సెట్స్‌లో రీసెంట్‌గా సూర్య కూడా జాయిన్‌ అయ్యాడట. కాగా ఈ సినిమా నుంచి సూర్య కత్తి పట్టుకున్న లుక్‌ ఒకటి మేకర్స్‌ తాజాగా రిలీజ్‌ చేశారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *