ఆగని పెట్రో ధరా”ఘాతం”

 ఆగని పెట్రో ధరా”ఘాతం”

భూమిపుత్ర,న్యూ ఢిల్లీ:

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు కొనసాగుతున్నది. గడిచిన 40 రోజులుగా చమురు కంపెనీలు ధరలు పెంచుతూ వస్తుండగా తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలకు పెరిగింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటింది. మరో వైపు డీజిల్‌ సైతం రూ.100 వైపు వేగంగా పరుగులు పెడుతున్నది. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.41, డీజిల్‌ రూ.87.28కు చేరింది. మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇంధన ధరలు 25 సార్లు పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరాయి. మరో వైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌రూ.107, లీటర్‌ డీజిల్‌ రూ.100కుపైగా దాటింది.

తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్కెట్‌ను ధాటింది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100.20కు చేరగా డీజిల్‌ లీటర్‌ రూ.95.14కు పెరిగింది. దేశంలో ఇంధన ధరలు సోమవారం కూడా మండాయి. గత 42 రోజుల్లో పెరుగుదల నమోదు చేయడం 24వ సారి.దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరల ఆధారంగా వీటి ధరలు నిర్ణయిస్తుంటారు. పెరిగిన ధరలతో ఢిల్లీ లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 96.40గా ఉండగా… డీజిల్‌ 87.28 రూపాయలకు చేరువైంది. ఇక ఇతర రాష్టాల్లో వ్యాట్‌తో సహా ఇతర పన్నులు కలుపుకుని ధరల్లో మార్పులు ఉంటాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *