విశాఖ టౌన్‌ హాల్‌ కు కొత్త హంగులు

 విశాఖ టౌన్‌ హాల్‌ కు కొత్త హంగులు

ఒన్ టౌన్ హాల్,విశాఖపట్టణం.

భూమిపుత్ర,విశాఖపట్నం:

చెదలు పడుతున్న చరిత్రకు విశాఖ అదికారులు మెరుగులు అద్దారు.కాలగర్బంలో కలిపోతూ రాజసాన్ని కోల్పోయే స్ధితిలో ఉన్న ప్రసిద్ది చెందిన నిర్మాణాలు మళ్లీ పూర్వవైభవంతో రాజసాన్ని ప్రదర్శిస్తున్నాయి.ఏళ్ల చరిత్ర కలిగిన కట్టడాల విశిష్టతను భావి తరాలకు తెలియచేసేలా అధికారులు చేసిన కృషి విశాఖ ప్రజల ప్రసంసలు అందుకుంటోంది.గతమెంతో ఘన కీర్తి కలిగి ఆదరణ లేక శిథిలావస్థకు చేరువవుతున్న విశాఖ వన్‌ టౌన్‌ హాల్‌ ఇప్పుడు సరికొత్త హంగులతో దేదీవ్యమాసంగా కాంతులీనుతోంది.

స్వాతంత్య్ర ఉద్యమంలో విశాఖ టౌన్‌ హాల్‌ ప్రముఖ పాత్ర పోషించింది.స్వేఛ్చ కోసం సాగిన సాయుధ పోరాటాల సమావేశాలకు ఈ టౌన్‌ హాల్‌ వేదికైంది.అప్పట్లో మహాత్మాగాంధీ అద్యక్షతన ఇక్కడ సభలు సమావేశాలు జరిగాయని చరిత్ర చెబుతోంది. అలాంటి విశిష్టత కలిగిన టౌన్‌ హాల్ రాజసాన్ని కోల్పోయి ఆదరణ లేక ఎండమావిగా మారిన పరిస్థితినుండి అధికారుల కృషితో నేడు సుందరంగా రూపుదిద్దుకుంది. ఒక్క సారి చరిత్రను విశ్లేషిస్తే ఈ ప్రాంతానికి బ్రిటిష్‌ కాలంలో రూపుదిద్దుకున్న ఈ అపురూపమైన కట్టడాలకు దాదాపుగా 300 ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. ఈ టౌన్‌ హాల్‌ వేదికకగా స్వాతంత్య్ర సమయంలో కీలక సమావేశాలు జరిగినట్లుగా చరిత్ర చెపుతోంది. అప్పట్లో వైజాగ్‌ పటంగా పిలిచే ఈ ప్రాంతంలో ఈ టౌన్‌ హాల్‌ ను 1904తో నిర్మించారు.1903 నుంచి బ్రిటీష్‌ వాళ్లు చేపట్టిన నిర్మాణాల్లో ఈ టౌన్‌ హాల్‌ ప్రసిద్ది చెందింది.

తెల్లదొరలను తరిమికొట్టేలా ఉద్యమ స్పూర్తిని రగిల్చి .. తెలుగు జాతి ఔన్నత్యాన్ని , పౌరుషాన్ని ఎలుగెత్తి చాటిన మహానీయుల రాకతో ఈ టౌన్‌ హాల్‌ కు చరిత్రలో ఓ అధ్యాయాన్నే లిఖించబడి నేటికీ అలనాటి జాతి సమగ్రతకు,ఐక్యత కోసం జరిగిన పోరాట సమయంలో ఈ టౌన్‌ హాల్‌ వేదిక కావడం విశాఖ కు ప్రత్యేక గుర్తింపును సాదించింది.ఇదే టౌన్‌ హాల్‌ వేదికకగా పలు చిత్రాలు నిర్మాణాలు కూడా జరిగాయి. హాస్యనటుడు రాజేంద్రప్రసాద్ చిత్ర నిర్మాణం కూడా ఇక్కడే జరిగి సినీ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపును చాటుకుంది ఈ టౌన్‌ హాల్‌.విశాఖపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్న ప్రభుత్వం ఈ టౌన్‌ హాల్‌ ను 3 కోట్ల రూపాయల నిదులతో అభివృద్ది చేసింది.అయితే చారిత్రాత్మక ప్రదేశాల విశిష్టత మరుగున పడుతున్న తరుణంలో వీటికి పునరుద్దరించేలా అదికారులు చేసిన ప్రయత్నాలు ఫలించి ఠీవిని రాజసాన్ని ప్రదర్శిస్తున్నాయి.

Related News

Leave a Reply

Your email address will not be published.