శ్రీశైలంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దంపతులు

 శ్రీశైలంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దంపతులు

భూమిపుత్ర,కర్నూలు:

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి శ్రీశైలం విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ జి వీరపాండియన్‌ పుష్ప గుచ్చం, పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారిగా దర్శనానికి వచ్చినందున అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, డిఐజి వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణ కృపా సాగర్‌, జిల్లా ఎస్పీ డాక్టర్‌ కె. పక్కిరప్ప, ఏపీ హైకోర్టు రిజిస్టర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ డి వెంకటరమణ, తెలంగాణ హైకోర్టు రిజిస్టర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, జస్టిస్‌ డి. నాగార్జున, జిల్లా జడ్జి ఫ్యామిలీ కోర్టు వి. శ్రీనివాస్‌, దేవస్థాన ఈవో కేఎస్‌.రామరావు, తదితరులు పాల్గొన్నారు. పోలీసుల నుంచి సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ గౌరవ వందనం స్వీకరించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *