సూక్ష్మక్రిమి సృష్టిలో చైనా కుట్రను చేధించగలరా?

 సూక్ష్మక్రిమి సృష్టిలో చైనా కుట్రను చేధించగలరా?

భూమిపుత్ర,అంతర్జాతీయం:

తెలుగువారికి గండికోట రహస్యం,రాజకోట రహస్యం,జ్వాలదీప రహస్యం లాంటివి బాగా తెలుసు.సినిమాలు చూసిన వారికి ఇవి చాలా నివ్వెరపరుస్తూ ఉంటాయి.అలాంటి రహస్యాలే ఇప్పుడు చైనాలోని వూహాన్ లో ఉన్నాయన్నది ప్రపంచ దేశాల వాదన.అక్కడి నుంచి కరోనా వైరస్ ప్రపంచం మీద దాడి చేస్తోంది.దీనిపై నమ్మదగిన ఆధారం ఇప్పటి వరకు అందకపోయినా లేకపోయినా అనుమానాలు మాత్రం ఉన్నాయి.అందుకే ఇప్పుడు వూహాన్ రహస్య కోటను ఛేదించాలన్న వాదన బలపడుతోంది.ప్రపంచ దేశాల్లో దీనిపై పట్టుదల పెరుగుతోంది.అమెరికా అధ్యక్ష పీఠం నుంచి ట్రంప్ దిగిపోయినా కరోనా పీడ గురించి మాత్రం ఆ దేశం అన్వేషణ ఆగిపోలేదు.తాజాగా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ కూడా ట్రంప్ బాటలోనే కరోనా మూలాలు వెదికి పట్టాలని ఆదేశించడం చూస్తుంటే అమెరికా పట్టుదల ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ట్రంప్ తో పోలిస్తే బైడెన్ గుంభనంగా ఉంటారు.దుందుడుకుతనం అస్సలు కనిపించదు.గతంలో ట్రంప్ ఈ విషయంలో చైనాను గట్టిగానే నిలదీసి ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు.తాజాగా కరోనా పుట్టుకను కనుగొనే ప్రయత్నాలను వేగవంతం చేసి,90 రోజుల్లోగా పూర్తి నివేదిక అందించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశంలోని నిఘా విభాగాలను ఆదేశించారు.వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే పలువురు పరిశోధకులు 2019 నవంబర్ లో అనారోగ్యం పాలై ,ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు అమెరికా ప్రభుత్వ నిఘా నివేదిక వెల్లడించిన నేపథ్యంలో బైడెన్ ఈ ఆదేశాలిచ్చారు.నిఘా వర్గాల ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు జాతీయ పరిశోధనశాలలు,ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా తోడుగా నిలవాలని కోరారు.చైనా నుంచి సమాధానం రావాల్సిన కొన్ని నిర్దిష్ట ప్రశ్నలతో పాటు తదుపరి విచారణ చేపట్టాల్సిన అంశాలను కూడా ఆ నివేదికలో పొందుపరచాలని సూచించినట్లు బైడెన్ ఒక ప్రకటన చేశారు.

పారదర్శకంగా సాక్ష్యాల ఆధారంగా సాగే అంతర్జాతీయ విచారణకు సహకరించి,అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని,ఆధారాలను అందించేలా చైనా పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు భావసారూప్యం గల దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు.అయితే ఈ ప్రయత్నాలకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తోంది.దాదాపు అన్ని దేశాలు చైనా పై వేలెత్తి చూపుతున్నాయి.ఎందుకంటే దాదాపు అన్ని దేశాలు కూడా కరోనాతో అతలాకుతలం అయినవే.ఇంకా కోలుకోలేని దశలో అనేక దేశాలు ఉన్నాయి.ఇప్పటికే లక్షలాది మంది పౌరులను ఆయా దేశాలు కోల్పోయాయి.అయితే సహజంగానే అమెరికా చేస్తున్న ఆరోపణలను చైనా మరోమారు ఖండించింది.నిజాలను,వాస్తవాలను అమెరికా అంగీకరించదంటూ విమర్శలను ఎత్తుకుంది.మూలాలపై శాస్త్రీయత ఆధారిత అధ్యయనంపై ఆ దేశానికి నమ్మకమే లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ పేర్కొన్నారు.తమకు కళంకాన్ని ఆపాదించేందుకు,నిందలు వేసేందుకు ఈ మహమ్మారిని అమెరికా ఒక అవకాశంగా తీసుకుంటోందని ఆరోపించారు.

దాదాపుగా వూహాన్ నుంచే ఈ వైరస్ వదిలారన్న ప్రపంచ దేశాల అనుమానాలను చైనా ఇప్పటికీ నివృత్తి చేయలేదు.ఇకపోతే ఇది మానవ సృష్టిత వైరస్ అని కూడా తేలింది.అలాకాకుండా ఉండివుంటే వైరస్ తీవ్రత ఇంతగా ఉండి,ఇంతగా మార్పులు చెంది,ఇంతమందిని పొట్టన పెట్టుకునేది కాదన్న అనుమానాలు ఉన్నాయి.కరోనా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సమగ్ర విచారణ జరపాలని అంతర్జాతీయంగా వస్తున్న డిమాండ్లకు భారత్ మద్దతు తెలిపింది.చైనాలో కరోనా వైరస్ ఎలా వచ్చిందో నిగ్గు తేల్చాలని అమెరికా నిఘా సంస్థలను ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించిన దరమిలా అమెరికా,ఆస్ట్రేలియాలతో పాటు పలు దేశాలు కరోనా వైరస్ మూలాలపై విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాయి.వైరస్ మూలాల పై మార్చిలో డబ్ల్యూహెచ్ఓ ఒక నివేదిక వెలువరించినప్పటికీ దానిపై ప్రపంచదేశాలు సంతృప్తి వ్యక్తం చేయలేదు.ఆ నివేదిక పేర్కొన్న అంశాలపై మరింత అధ్యయనం‌ వైరస్ మూలాలపై ఒక స్పష్టత అవసరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరింధమ్ బార్చి తెలిపారు.అయితే చైనాను నమ్మడానికి లేదని దాని చరిత్ర చూస్తే ప్రపంచదేశాలు ప్రకటిస్తున్నాయి.అదుకే కరోనా వైరస్ పుట్టిందెక్కడ అన్నది నిగ్గు తేలాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.

చైనాలోని వూహాన్ జంతు వధశాల నుంచే అంటిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు తేల్చేసినా ఇంతకీ వైరస్ ది సహజ జన్మమా లేక టెస్ట్యూబ్ జననమా ? అన్నదానిలో అనుమానాలు అలాగే ఉండిపోయాయి.ప్రపంచానికి కరోనా వైరస్ పరిచయమై ఏడాదిన్నర కాలమవుతోంది.చైనాలోని వూహాన్ లో మొదలైన మహమ్మారి ప్రస్థానం అతికొద్ది కాలంలో ప్రపంచం మొత్తాన్ని చుట్టేయడమే కాకుండా లక్షల మంది ప్రాణాలను హరించింది.ఇంత జరిగినా దీని పుట్టుక పై అనుమానాలు వీడడం లేదు.గతంలో అనేకానేక వైరస్లు పుట్టుకుని వచ్చినా ఇంతగా జనహననం జరగలేదు.అలాగే ఇంతగా నష్టం జరగలేదు.గత ఏడాది మొదట్లోనే పూహాలోని ఓ పరిశోధనశాల నుంచి ఈ వైరస్ కాకతాళీయంగా బయటపడిందన్న వాదన ప్రచారంలోకి రావడం దీనిపై విచారణ జరపాలని అప్పటి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేయడం చైనా దానిని కొట్టి పడేయడం చూసాం.అయితే గండికోట రహస్యంలా వూహాన్ రహస్యం ఛేధించాల్సి ఉంది.ఎందుకంటే తను చేసిన తప్పును ప్రపంచం గుర్తించకుండా ఉండేందుకు చైనా వేయని ఎత్తు లేదు.

భారత్ తో సరిహద్దు సమస్యలను సృష్టించి యుద్ధం అంచుల వరకు తీసుకుని వెళ్లి,ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించే కుట్రలను చూసాం.వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి ఈ వైరస్ యాదృచ్ఛికంగానో లేదా ఉద్దేశపూర్వకంగానో బయట పడిందన్నది మొదటి నుంచి ఉన్న అనుమానం.ఈ ఇన్స్టిట్యూట్ చైనాలోనే అతిపెద్ద బయలాజికల్ రీసెర్చ్ సెంటర్ కావడం గమనార్హం.కరోనా వైరసను మొట్టమొదటిసారి గుర్తించిన హునాన్ జంతు వధశాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ పరిశోధన కేంద్రం ఉంటుంది.పరిశోధనశాల నుంచి బయటపడ్డ వైరస్ ఈ వెట్ మార్కెట్ లోని జంతువులకు చేరిందని ఈ కుట్రను నమ్మేవారు చెబుతారు.అడవి జంతువుల్లో ఉండే ఈ వైరస్ ను వేరు చేసి మార్పుల్లేకుండా వ్యాప్తి చేశారని అంటున్నారు.గత ఏడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇది చైనీయులు కుట్రపూరితంగా తయారు చేసి ప్రపంచం మీదకు వదిలారని ఆరోపణలు చేశారు.కరోనా వైరస్ ను చైనా జీవాయుధంగా ఉపయోగించిందని ఇప్పుడు ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి.మొత్తంగా అమెరికా ప్రయత్నాలు ఫలించాలని భారత దేశం బలంగా కోరుకుంటోంది.వూహాన్ రహస్యం ఛేదించగలిగితే ప్రపంచ దేశాలకు అంతకుమించిన ఆనందం ఉండబోదు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *