నిజాయతీ పార్శ్వాలను పేజీలుగా మలుచుకుని నిలిచిన ప్రజాస్వామ్య గొంతుక భూమిపుత్ర

 నిజాయతీ పార్శ్వాలను పేజీలుగా మలుచుకుని నిలిచిన ప్రజాస్వామ్య గొంతుక భూమిపుత్ర

భుామిపుత్రోద్భవం
మానవ జీవనం అనేక మజిలీల్లో అనాగరిక జీవన ముసుగుల్ని ఛేదిస్తుా అధునాతన శాస్త్ర సాంకేతికత పరిజ్ఞానాన్ని హస్తగతం చేసుకున్న సమకాలీన సమాజాన్ని సక్రమ సంస్కరణ మార్గంవైపుకు నడిపేందుకు, సామాజిక నైతిక విలువల్ని సమాహారంచేస్తుా
ప్రతీ రోజు దినపత్రికలు మేధాముంగిళ్ళలో అక్షరపొద్దులై ఉదయిస్తున్నవి.
“వార్తయందు జగము వర్థిల్లుచున్నది
యదియు లేని వాడ యఖిల జనులు
నంధకారమగ్నులగుదురు”
మహా కవి‌ తిక్కన అన్నట్టు
“పత్రికొక్కటున్న పదివేల సైన్యము
-నార్ల వెంకటేశ్వర రావు గారు చెప్పినట్లు ఇప్పుడిది పత్రికా యుగం మానవ వికాస చరిత్రలో సమాచారం అందించే పత్రికల చరిత్ర అతి విష్టమైనది,పవిత్రమైనది విలువైనది వాస్తవానికి నాటి కాలంలో సమకాలీన సమాజంలో ప్రజల సాంఘిక, రాజకీయ,ఆర్థిక, మత, సాంస్కృతిక మానవీయ విలువల విషయాల్ని ప్రజలకు తెలియజెప్పే ప్రాధాన్యత ప్రధానలక్ష్యంతో కనిపించిన సమాజనేత్రం పత్రికైంది.కానీ ప్రస్తుత కాలంలో ఆ నిర్వచనాలు విరుద్ధ రీతిలో ఫలితాలైతున్నవి.ప్రంచదేశాల మానవ మనుగడ అత్యంత క్లిష్టతరమైన నేటి ఆధునిక సాంకేతిక సమాజాన నిస్పక్షపాతం ముాలాలపై మొగ్గదొడిగి నిజాయితీ పార్శ్వాలను పేజీలు పేజీలుగా అంటించుకొని ప్రజాగొంతుకై నిలిచిన భుామిపుత్ర దినపత్రిక గురించి కొన్నిఅంశాలు తెలుసుకోవాల్సినవసరం ఇప్పుడు అనివార్యం. నేటికాలంలో పత్రికలు రాజకీయపార్టీల ప్రతీకలై దర్శనమిచ్చే సందర్భాన జర్నలిజం దోపిడి దందాలిజమైపోయే సంఘటనల సాక్షాత్కార దృశ్యాలలోన పత్రికా యజమాన్య సంపాదకత్వం ఆర్థికత్వ పునాదుల్లో నోట్లకట్టలతో బలపరుచుకొని ప్రజల్ని ప్రశ్నించే చైతన్యం వైపు కాక పాలకులకు బానిసల్ని జేస్తున్న వాస్తవ కాలాన ఓ పత్రిక ధర్మపునఃనిర్మాణం కోసం సాగు మొదలుపెట్టిన ధైర్యం భుామిపుత్ర పత్రిక.కులమత లింగ వర్ణ పేద ధనస్వామ్య జాడ్యాలను కుాలదోస్తూ సామాజిక సమస్యలకు ప్రజాస్వామిక పరిష్కార మార్గనిర్థేశం చేస్తుా.సంక్షేమాభివృద్ధి పేరున కర్కశత్వ నియంతృత్వ దృక్కోణ ధోరణులను పటాపంచలుచేస్తుాకకావికలమై పోయే మానవీయ విలువలకు అక్షరజ్ఞాన నెలవై దారిచుాపే ప్రయత్నాన్ని కొనసాగించే భుామిపుత్ర పత్రికకు తెలుగు జిహ్వలు జేజేలు తెలపాలి.ఎందుకనగా పోటీ ప్రపంచాన ప్రయత్నాలను, ప్రయోగాలను ప్రోత్సహించక కుాలదోసే కుట్రలుజేసే స్వార్థచింతన పెరిగిన సమాజాన్ని సంస్కరించాలనే సంకల్పం కత్తిమీద సాము లాంటిది ఎతో సాహసోపేతమైంది. ఆ సాహసాన్నే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీహరి ముార్తిగారి ముార్తిమత్వం మహోన్నతమైంది .తాను రుాపొందించిన భుామిపుత్ర బహుముఖమైందని చెప్పాలి.

సంపాదకీయం
సంపాదకీయం పత్రికకు ఊపిరి వంటిది .తెలుగు భాషకు అచ్చులు ఏ విధంగానైతే ప్రాణులు, ప్రాణాలో పత్రికకు సంపాదకీయమట్టిది
ఇవి తత్కాలనికి సంభందించినవే అయినా ఒక్కో సందర్భంలో విభిన్నకాలాలకు అనువర్తింపజేసుకోవచ్చు
తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటుా, ఆలోచింపజేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం.ఈ లక్షణానికి అక్షరసాక్ష్యం భుామిపుత్ర సంపాదకీయవ్యాసం ప్రాపంచికమైన ఎన్నో విభిన్నాంశాలపై భుామిపుత్ర సంపాదకీయం ప్రచురిస్తుా వస్తుంది
పత్రకగురించి మాట్లాడాల్సివస్తే ముందు సంపాదకీయం గురించే చెప్పాలి. సంపాదకీయం పత్రికయొక్క శీలం,గుణం వంటిది.

మట్టిపరిమళాల అక్షర ఝరి
సంపాదకీయం నిజమైన మట్టివాసనల్ని తేనెతీగలవలె వాస్తవాల్ని తేనె తెప్పలవలె ప్రజలకు అందిస్తున్నది.పల్లె పట్నం -, సంస్కృతి సంప్రదాయాలు,ప్రకృతి పంచభుాతాలు,ప్రమాదాలు వివాదాలు, ఉద్యమాలు ఉద్వాసనలు,ప్రభుత్వాలు పాలనలు,వాదాలు వివాదాలు, \మోహలు విముక్తాలు,దైవాలు ధైన్యాలు ఆద్యాత్మిక విలువలుమోసపుారిత విలువలు విద్యా వైద్యం సేద్యం వాద్యం వంటి అంశాల్లో సంమకాలీన సంఘటల్ని ఉదాహరణలుగా ప్రతిపాదిస్తుా పుార్వాపరాలను పరామర్శిస్తుా సాగిన భుామిపుత్ర సంపాదకీయ వ్యాసాలు పత్రికా గొప్పతన తార్కాణాలనే చెప్పాలి.నేను చదివిన సంపాదకీయలను విశ్లేషించిన వ్యక్తిగా ఒప్పుకునే మాటిది.పన్నెండు పేజీల్లో నన్ను కట్టిపడేసేది ఎడిటోరియల్ పేజీయే.ఆ పేజీలోనే మరో రెండు ముాడు సామాజిక అంశాలు వ్యాసాలై కనిపించడం మరో శైలి. సీనియర్స్ జుానియర్స్ అనే విబేధాలకు తావీయకుండా ప్రతిభావంతగా సామాజిక సమస్యలను లేవనెత్తి ప్రజా చైతన్యం వైపుకు నడిపించే వ్యాసాలు ఎవ్వరు రాసినా వాటిని ముద్రిస్తుంటుంది. ప్రత్యేక సందర్బాల్లో మహనీయుల జయంతి వర్థంతులు, సంస్కృతి సంప్రదాయాలు, వచ్చినప్పుడు ఇంకా ఆ పేజి విశాలప్రపంచాన్ని కనబరుస్తుంటది. నిజంగా భుామిపుత్రకు తలమానికం సంపాదకీయ /ఎడిటోరియల్ పేజి.

భూమిపుత్ర దినపత్రిక

పతాక శీర్షికల శైలి
జాతీయ, అంతర్జాతీయ, ప్రాతీయ విషయాలను ప్రాథాన్యతాపుారకంగా వైవిధ్యభరితంగా ఏ ప్రథాన పత్రికలకు తీసిపోని విధంగా అనుకరణకు తావులేకుండా కలర్ మేకింగ్ లో విశిష్టతను కనబరుస్తుాఅనుాహ్యరీతిలో పతాక శీర్షికలను భుామిపుత్ర రెక్కలుగమలుచుకొని ఎగిరివస్తుంటది.ఎదిగి నిలుస్తుంటది.ఇక్కడ బ్యానర్ టైటిల్ ను బట్టి ఫాంట్ స్టైల్ మార్చడం ఇంకా ఆకర్షణీయమై కనిపిస్తుంటది.అగ్రదేశాల రాజకీయాల నుండి గ్రామ రాజకీయల వరకు దేనినైనా పతాక శీర్షిక చేయడం లో విలక్షణత కనబరుస్తుంటది.ఇరు తెలుగు రాష్ట్రలల్లో తెలుగు భాషకు మళ్ళోమారు సగర్వంగా గర్వపడే వన్నెతెచ్చింది.

సాహిత్య పుత్రికావతారం వర్థమాన సాహితీ రంగప్రవేశం జరిగిందని,తెలుగు సాహిత్య విలువలు సన్నగిల్లుతున్నవన్న విమర్శలను, తెలుగు కీర్తి విఖ్యాతిని కవులు సాహితివేత్తల పరామర్శను సమన్వయపరుస్తుా, సాహిత్య భాషా వ్యాసాల ను ప్రచురణలోకి తీసుకొచ్చింది భుామిపుత్ర. తెలుగు సాహిత్య వికాసానికి కవులు, రచయితల పై వ్యాసాలు, ప్రామాణిక కావ్యాలు, పుస్తకాల పై సమీక్షలు, భాషాసంస్కరణ దిశగా, భాషాభివృద్ధి కృషివైపుగా వ్యాసంగం కొనసాగడం ఎంతో సంతోషించదగిన అంశం. పత్రికలు సాహిత్య వికాసానికి ప్రధాన భుామిక పోషిస్తుంటవి కాబట్టి ఏ పత్రికైనా ఒకే వాదానికి గాని ఒకే రకమైన సాహిత్యానికి గాని కట్టుబడి పోకుడదన్న నడవడికను నేర్పుతుంది భుామిపుత్ర. సాహిత్యానుశీలన : అన్ని వాదాల వర్గాల వర్ణాల సాహిత్యాంశాలను వెలికితీసి పాఠకుల పఠనాభిరుచికి అనుగుణంగా ప్రాచీన కాలం నుండి వర్థమాన కాలం వరకు అన్నిప్రక్రియల సాహిత్యహితాలను తెలియబరుస్తుంది.

క్రీడలు – వినోద సురభిచిత్రం
క్రీడావినోద లోకం హంగుల రంగులు అద్దుకొని ప్రతీరోజు హోళి పండగైనంత పంసందు చేసే వార్తల్లోవినోద చిత్రాన్ని భుామిపుత్ర నాటక రంగస్థలంనుండి కళాప్రతిభ డిజిటల్ కెమరాల్లో కెళ్ళిందన్న నిజం మరవలేదు గనుకేతెలుగు రాష్ట్రాల గర్వకారణం సురభిసంస్థ కళ కళామతల్లి అబ్బురపడే ప్రదర్శనలవి ఆ ముాలాలను వినోదపేజీ కి శీర్షిక సురభిచిత్ర అని చెప్పడంలోనే ఒక విలక్షణత కనబడుతుంది అలాగే జాతీయ అంతర్జాతీయ ప్రాతీయ క్రీడల సమాచారాన్ని అందించడంలో అందెవేసిన చెయ్యిలా మారింది .
సంస్కృతీపుత్రిక
తెలుగు సంస్కృతీ సంప్రదాయాలంటే జిగిమెండు గౌరవం. తెలంగాణాంధ్ర ప్రాంతాల అవధులు చెరిపేసే సంస్కృతి కి తిలకంగా కనిపిస్తుంటది. తెలుగు పండగలు పబ్బాలు, వ్రతాలు జాతర్లు, దైవభక్తిలోను లౌకిక ధోరణులనవలభిస్తుావ్యవహరించే తీరు భళా అనిపిస్తది
ప్రత్యేక కథనాలు – సమకాలీన సమస్యలు
ఎక్కడైనా ఎప్పుడైనా అనుకోకుండా ఎదురైయే సమస్యల పై గానీ , చరిత్రలో నిలిచిపోయి చిరస్మరణీయమైన సంఘటనా సందర్భాలు గాని వచ్చినప్పుడు భుామిపుత్ర ప్రత్యేక కథనావతారియై నిలుస్తుంటది. అప్పుడు గొప్ప ప్రాధాన్యత ను పొందాలనే తాపత్రయం కాక పుార్వాపరాల పరామర్శతో చరిత్రముాలాల్లోకి వెళ్ళి పరిశోధించిన అంశాలనే తీసుకొస్తుావుంటది.అనంతపురం జిల్లాలో జిల్లా పేజీలు ప్రారంభించి నెమ్మదిగా అన్ని జిల్లాల వార్తా సేకరణ పై దృష్టి కేంద్రీకరించే ప్రయత్నంజేస్తున్నది.సాధారణ వార్తకి సంపాదకీయానికి మధ్య వ్యత్యాసముంటది కానీ ఇక్కడ పల్లె గ్రామీణ వార్తకుాడా నిజాలను, సత్యాన్వేషణ చేసినట్టే సేకరించడం ముార్తిగారి నిబద్ధతకు మచ్చుతునకలనే చెప్పవచ్చు.అలా ప్రతీరంగాన్ని పత్రికీకరణ ప్రతిపాదనగా చెప్పగలప్రజాస్వామిక ప్రవాహికగా మారింది.సాహస గుణమే సహజలక్షణంగా వున్న భుామిపుత్ర పత్రిక ఇంకా ఎన్నో ఎన్నెన్నో విజయపరంపరల పర్వతాలపై ధ్వజ కేతనమై ఎగరాలని ఆశిస్తు శుభాకాంక్షలు తెలిజేస్తున్నాను .

డాక్టర్ మహేందర్ కట్కుారి
9618447209
హన్మకొండ ,వరంగల్
తెలంగాణ రాష్ట్రం

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *