మిజోరాంలో ఆశ్రయం పొందిన మయన్మార్‌ నేత

 మిజోరాంలో ఆశ్రయం పొందిన మయన్మార్‌ నేత

ఓ వార్తా సంస్థ ప్రకటనతో వివరాలు వెల్లడి

భూమిపుత్ర ,మిజోరాం:

మయన్మార్‌లోని చిన్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి సలాయ్ లియాన్‌ లువాయి భారత దేశంలోని మిజోరాంలో ఆశ్రయం పొందారు. మయన్మార్‌ సైన్యం తిరుగుబాటు చేసి, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దె దించిన నేపథ్యంలో ఆ దేశం నుంచి దాదాపు 9,000 మంది పారిపోయారు. వీరిలో చిన్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి ఒకరు. మిజోరాం రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, చిన్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి సలాయ్‌ లియాన్‌ లువాయి మిజోరాంలో సోమవారం రాత్రి ప్రవేశించారు. మారుమూలన ఉన్న చంపాయ్‌ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారు. దాదాపు 20 మంది మయన్మార్‌ ప్రజా ప్రతినిధులు మిజోరాంలో ఆశ్రయం పొందుతున్నారు.

ఈ రాష్ట్రంలో ఆశ్రయం పొందుతున్నవారిలో మయన్మార్‌ పోలీసులు కూడా ఉన్నారు. ఆంగ్‌ సాన్‌ సూ చీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఆఫ్‌ డెమొక్రసీ పార్టీ నేత సలాయ్‌ లియాన్‌ లువాయి. మిజోరాం ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాలను వివరించింది. మయన్మార్‌ నుంచి శరణార్థులు వస్తుండటాన్ని మానవతావాద సంక్షోభంగా చూడాలని కోరింది. 1,643 కిలోవిూటర్ల మేరకు సరిహద్దును భారత్‌ -మయన్మార్‌ పంచుకుంటు న్నాయి. 510 కిలోవిూటర్ల మేరకు సరిహద్దులో మిజోరాంలోని చంపాయ్‌, సియాహా, లాన్‌గ్‌ట్లాయ్‌, సెర్చిప్‌, హ్నప్‌ థియాల్‌, సైటువాల్‌ జిల్లాలు ఉన్నాయి. మయన్మార్‌లోని చిన్‌ జాతి ప్రజలు, భారత దేశంలోని మిజో జాతి ప్రజలు సహజసిద్ధ స్థానికులైన జో జాతికి చెందినవారు. వీరి పూర్వీకులు ఒకరే కావడంతో ఇక్కడ భాషపరంగా, ఆచార వ్యవహారాల పరంగా పెద్దగా తేడా ఉండదు. దీంతో పలువురు ఇక్కడ ఆశ్రయం పొందారని తెలుస్తోంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *