మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తున్న ముంబై ఇండియన్స్

 మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తున్న ముంబై ఇండియన్స్

భూమిపుత్ర, ముంబై :

ఐపీఎల్‌ అంటేనే క్రికెట్‌ అభిమానులకు పండుగలా ఉంటుంది. అలాంటిది సంవత్సరం తిరగక ముందే రెండు సార్లు ఐపీఎల్‌ జరుగుతుండడంతో అభిమానుల ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో ఇప్పటికే ఎనిమిది మ్యాచులు పూర్తవగా తరువాయి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య తొమ్మిదవ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు రెండేసి మ్యాచులి ఆడగా, వాటిలో ముంబై ఒక మ్యాచ్‌లో విజయం సాధిస్తే హైదరాబాద్‌ జట్టు ఇంకా తన గెలుపు ఖాతా తెరవలేదు. గత మ్యాచులో గెలిచిన ఉత్సాహంతో ఈ మ్యాచులో కూడా గెలవాలని కుతూహల పడుతున్న ముంబైని ఎలాగైనా కట్టడి చేయాని హైదరాబాద్‌ భావిస్తుంది. నేడు జరగనున్న మ్యాచులో గెలిచి పాయింట్ల పట్టికలో ఖాతా తెరవాలని హైదరాబాద్‌ జట్టు చూస్తుంది.

అయితే, ఈ మ్యాచులో ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మాట్లాడుకుంటే ముంబై పేరే వినిపిస్తుంది. ముంబై ప్రతీ విభాగంలో మెరుగ్గా ఉంది. బ్యాటింగ్‌ విభాగంలో రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి ఫామ్‌లో ఉండగా మిగతా బ్యాట్స్‌మెన్లు కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారు. అటు బౌలింగ్‌ విభాగంలో కూడా బుమ్రా, బోల్ట్‌, చాహర్‌ కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. అటు హైదరాబాద్‌ జట్టులో కేవం వార్నర్‌, మనీష్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు ఆకట్టుకోలేకపోతున్నారు. బౌలింగ్‌ విభాగం నుంచి మంచి సపోర్ట్‌ అందుతున్నప్పటికీ బ్యాటింగ్‌ విభాగం బలంగా లేకపోవడంతో హైదరాబాద్‌ జట్టు బలహీనంగా కనిపిస్తుంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *