జూన్‌1న కేరళను తాకనున్న ఋతుపవనాలు – వాతావరణ శాఖ వెల్లడి

 జూన్‌1న కేరళను తాకనున్న ఋతుపవనాలు – వాతావరణ శాఖ వెల్లడి

మాధవన్ ఎన్.రాజీవన్

భూమిపుత్ర,న్యూఢిల్లీ:
భారత వాతావరణ శాఖ అంచనాల మేరకే జూన్‌ 1న ఋతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఫలితంగా రైతులకు మేలు జరిగే అవకాశమున్నట్లు భావిస్తున్నామని పేర్కొంది. ఇవి అంచనాలు మాత్రమేనని, ఈ నెల 15న ఋతుపవనాలు రాక, 31న వర్షపాతంపై వాతావరణ శాఖ అధికారిక ప్రకటన చేస్తుందని ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్‌ పేర్కొన్నారు. రుతుపవనాలు జూన్‌ 1న కేరళను తాకే అవకాశం ఉందని ముందస్తు విశ్లేషణలు సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది సాధారణ రుతుపవన ఏడాది అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు రాజీవన్‌ పేర్కొన్నారు. దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ)లో ఈ ఏడాది 98 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏప్రిల్‌ 16న భారత వాతావరణశాఖ తన ముందస్తు సూచనలో పేర్కొంది. ఈ అంచనాల్లో 5 శాతం అటూఇటుగా ఉండే అవకాశం ఉందని వివరించింది. భారత్‌లో వరుసగా రెండేళ్లు సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిశాయి. అయితే, ఈసారి మాత్రం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *