మోదీ అసంబద్ధ విధానాలు- మరో సంక్షోభంలో కి జనం

 మోదీ అసంబద్ధ విధానాలు- మరో సంక్షోభంలో కి జనం
భూమిపుత్ర, సంపాదకీయం:

దేశంలో కరోనా రెండవదశ దూసుకుని వస్తోంది. ప్రజల జీవితాలను మళ్లీ అతలాకుతలం చేసే పరిస్థితులు దాపురించాయి. యధావిధిగానే ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిలో ముందుకు సాగుతున్నాయి. ఆయా రాష్ట్రాలు సొంతంగా లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు విధించుకుని కట్టడి చేస్తున్నాయి. మహారాష్ట్రలో మాత్రం అదుపు చేయలేనంతగా కేసులు పెరుగుతున్నా అవినీతిలో మునిగిన మహా ఆగాఢా ప్రభుత్వం కరోనా కట్టడిలో పెద్దగా శ్రద్ద పెట్టడం లేదు. అంతెందుకు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న మోడీ ప్రజల జీవితాలను గట్టెక్కించే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు.

దేశంలో ఆర్థికపరిస్థితి గాడి తప్పుతోంది. ప్రజల ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి ఏడాది గడిచింది. మరోమారు కరోనా విజృంభిస్తున్నా కేంద్ర, రాష్ట్రాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోమని చెప్పడం మినహా దాని ద్వారా ఎంతమేరకు ఫలితాలు వస్తున్నాయో అధ్యయనాలు చెప్పడం లేదు. కరోనా వికటించిన వారి గురించి ఆలోచించడం లేదు. అలా మరణించిన వారి గురించి అసలు ఆరా తీయడం లేదు. ఇకపోతే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు, ప్రజల ఆర్థిక వ్యవస్థ కూడా గాడి తప్పింది. ప్రజలు బతకడం కష్టంగా మారింది. నిత్యావసర ధరలు దాడి చేస్తున్నాయి. అయినా దేశాన్ని ఉద్దరించామని మోడీతో పాటు, ఆయన తాబేదార్లు డప్పుకొట్టు కుంటున్నారు. కరోనా ఇబ్బందుల్ని అధిగమించి మన దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని, ’వి’ ఆకారపు రికవరీ బాటలో ముందుకు సాగుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పిన మాటు ప్రజను నమ్మించడానికి తప్ప ఎందుకూ పనికిరావడం లేదు. గత ఏడు నెలల కనిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి పడిపో యిందని తాజా గణాంకాలు తేల్చిచెప్పాయి. దీనికి తోడు నిరుద్యోగం, అధిక ధరలు, ప్రజలను బెంబేలెత్తి స్తున్నాయి. మరోవైపు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాల్సిన ప్రధాని మోడీజీ ప్రభుత్వ రంగ సంస్థలను తన అనుయాయ పారిశ్రామకివేత్తలకు అప్పనంగా కట్టబెట్టే పనిలో ఉన్నారు. ఈ చర్యలు దేశంలో మరింత అనిశ్చితికి కారణం కాబోతున్నది. ఉన్న ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. పారిశ్రామిక రంగంలో సంక్షోభానికి కారణం ఉత్పత్తి అయిన వస్తువుకు మార్కెట్‌లో సరైన డిమాండ్‌ లేకపోవడం.. డిమాండ్‌ ఉన్న వస్తువు ఉత్పత్తికి ప్రోత్సాహం లేకపోవడం ప్రస్తుత దేశంలో ఉన్న పరిస్థితి. గిరాకీ పడిపోవడానికి ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పడిపోవడం కూడా ఓకారణం. ఈ పరిస్థితుల్లో ప్రజల పట్ల బాధ్యత వహించే ఏ ప్రభుత్వమైనా మొట్టమొదట చేయాల్సింది ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా చర్యలు చేపట్టాలి. ఈ పని చేయడానికి మోడీ ప్రభుత్వం మొదటి నుంచి మొండిగా నిరాకరిస్తూ వస్తున్నది. ప్రజకు నేరుగా నగదు బదిలీ, కనీస వేతనం పెంపు, నిరుద్యోగ భృతి, నరేగా మాదిరే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ని ప్రవేశపెట్టడం, ఉచితంగా విద్య, వైద్య సదుపాయాలు అందించడం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన వారందరికీ ఆహార ధాన్యాతో సహా 16 రకా నిత్యావసరాలు సరఫరా చేయడం వంటి చర్యు చేపట్టాలన్న విజ్ఞప్తులను బేఖాతరు చేస్తున్నది. చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థకు తిరిగి జవసత్వాలు కల్పించాలంటే ప్రభుత్వ వ్యయాన్ని పెంచడమొక్కటే మార్గం. ప్రభుత్వ వ్యయం పెంచడానికి అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి ఎంతమాత్రమూ ఒప్పుకోదు. ఈ పని చేయడానికి బదులు బడా పెట్టుబడిదారుకు పన్నుల్లో రాయితీలు ఇస్తే, దేశంలోకి పెట్టుబడులు పోటెత్తుతాయని, తద్వారా ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందనే వింత వాదనను మోడీ ప్రభుత్వం ముందుకు తెస్తోంది. అందుకే పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తోంది. వారికి సకల మర్యాదతో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామరాజన్‌, అమర్త్య సేన్‌, ప్రభాత్‌ పట్నాయక్‌ వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు చేస్తున్న సూచను మోడీ చెవికి ఎక్కడం లేదు. దేశాన్ని దోచుకుని ప్రపంచ కుబేరులుగా మారాలన్న పట్టుదలతో ఉన్న ఆదానీ, అంబానీ సూచనలనే మోడీ పాటిస్తున్నారని అర్థం చేసుకోవాలి. బడా కార్పొరేట్లకు యేటా లక్ష కోట్ల రూపాయలు కేవలం పన్ను రాయితీల రూపంలో ప్రభుత్వం ఇస్తున్నది. కార్పొరేట్లకు ఎన్ని రాయితీలు ఇచ్చినా .. పెట్టుబడులు తగ్గడమే తప్ప పెరగడం లేదు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఉత్సాహం చూపకపోవడానికి కారణం సరుకుకు గిరాకీ లేకపోవడమే. ఈ వాస్తవాన్ని అంగీకరించేందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్నది. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి ప్రజపై పరోక్ష పన్నుల రూపంలోను, పెట్రో ఉత్పత్తులపై ఎడాపెడా పన్ను వేయడం ద్వారా రాబట్టుకుంటున్నది. ప్రభుత్వ వ్యయాన్ని పెంచడానికి అవసరమైన అదనపు వనరుల సవిూకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను గుండుగుత్తగా అమ్మకానికి పెట్టింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలోనే కాదు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫల మైంది. కరోనా బారిన పడి క్షా యాభై వేల మంది చనిపోతే మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండో స్థానంలోను, మరణాల్లో మూడవ స్థానంలోను నిలవడం ద్వారా భారత్‌ రికార్డు సృష్టించింది. మండు టెండల్లో వలస కార్మికులు వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం సాగిస్తూ మార్గ మధ్యంలో తనువు చాలించిన హృదయ విదారక దృశ్యాలు మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కానరావు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో దారుణమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన మోడీ ప్రభుత్వం, కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్న పేదలు, వలస కార్మికులు, మహిళల విషయం లోనూ ఇదే తీరున వ్యవహరించింది. ’ఆత్మ నిర్భర్‌ భారత్‌’ పేరుతో ప్రకటించిన ప్యాకేజీలో సామాన్యులకు ఆవ గింజంత సాయం కూడా దక్కలేదు.

కరోనా లాక్‌డౌన్‌ కాలంలో ఒక వైపు 12.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతే, మరో వైపు దేశంలోని వంద మంది కుబేరులు వద్ద సంపద 13 క్ష కోట్ల మేర పెరిగింది. దేశంలో పేదలు మరింత పేదగాను, సంపన్నులు మరింత సంపన్నంగా మారడానికి కారణమైన మోడీ ప్రభుత్వ విధానాలు ఎంతమాత్రం క్షేమకరం కాదు. దేశంలో ఓవైపు కరోనా మళ్లీ పంజా విసురుతుంటే.. మరోపక్క దాన్ని ఎదుర్కొనేందుకు వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం ముమ్మరంగా ప్రయత్ని స్తోందే తప్ప కంట్రోల్‌ చేయడానికి గల అవకాశాలను పట్టించుకోవడం లేదు. ఇది ప్రజలను మరింత సంక్షోభం లోకి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *