హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి పర్వతమే- టీటీడీ కీలక ప్రకటన

 హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి పర్వతమే- టీటీడీ కీలక ప్రకటన

భూమిపుత్ర, తిరుమల:
శ్రీరాముడి ప్రియ భక్తుడైన హనుమంతుడి జన్మ స్థలంపై శ్రీరామ నవమి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ధైర్యానికి, అభయానికి మారుపేరుగా భక్తులు కొలిచే ఆంజనేయుని జన్మస్థలం తిరుమల గిరుల్లోని అంజనాద్రి అని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. అంజనాదేవి తపస్సు ఫలితంగా వాయుదేవుని ఆశీర్వాదంతో తిరుమలగిరి కొండల్లోని అంజనాద్రిపై వెలసిన జపాలీ తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలమని ఆధారాతో సహా నిరూపితమైనట్లు టీటీడీ పేర్కొంది. ఈవో కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఆలోచనతో చిదంబరశాస్త్రి ఆధ్వర్యంలో మురళీధర శర్మ, రాణి సదాశివమూర్తి, రామకృష్ణ తదితరుతో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ గత ఏడాది డిసెంబర్‌ 15న సమావేశమై చర్చించారు. అప్పటి నుంచి అనేక సార్లు కమిటీ సమావేశమై పరిశోధనలు చేసింది. పురాణాలు, ఇతిహాసాలు, ఇన్‌స్క్రిప్షన్స్‌, జియోగ్రఫీతో పాటు ఇస్రో నుంచి శాస్త్రవేత్తల ద్వారా లాట్యుట్యూడ్స్‌, లాంగ్యిట్యూడ్స్‌ అన్నింటినీ పరిశీలించి ఆంజనేయుడి జన్మ స్థానం తిరుమలగిరే అని ధృవీకరించింది. ఈ మేరకు శ్రీరామ నవమి రోజున అధికారిక ప్రకటన చేసింది. ఆంజనేయుని జన్మస్థలానికి సంబంధించిన పురావస్తు ఆధారాలను జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధరశర్మ వ్లెడిరచారు. ఆయన బుధవారం విూడియాతో మాట్లాడుతూ.. తిరుమల లోని అంజనాద్రే హన్మంతుని జన్మస్థలమని స్పష్టం చేశారు. హనుమ జన్మస్థానంపై సంకల్పం తీసుకున్నామని, ఆంజనేయుని జన్మస్థలంపై అన్వేషణ కొనసాగిందని పేర్కొన్నారు. నాలుగు నెలుగా పండితులంతా కలిసి ఆధారాలు సేకరించామని వివరించారు. వేంకటాచల మహాత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నామని తెలిపారు. పౌరాణిక, చారిత్రక, శాసన, భౌగోళిక ఆధారాలు సేకరించామని పేర్కొన్నారు. వేంకటాచలానికి అంజనాద్రితోపాటు 20 పేర్లు ఉన్నాయని తెలిపారు. త్రేతాయుగంలో వేంకటాచలాన్ని అంజనాద్రిగా పిలిచారని ఆచార్య మురళీధరశర్మ చెప్పారు.

ఆచార్య మురళీధర శర్మ

అంజనాద్రికి హనుమ పుట్టాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడని పేర్కొన్నారు. అంజనాదేవికి హన్మంతుడు ఇక్కడ పుట్టడం వల్లే అంజనాద్రి అని పేరు వచ్చిందని తెలిపారు. అంజనాద్రిలో పుట్టి వేంకటేశ్వరస్వామికి ఆంజనేయుడు సేవ చేశాడని చెప్పారు. కర్ణాటకలోని హంపి హన్మంతుడి జన్మస్థలం కాదని తెలిపారు. హంపి కాదని చెప్పడానికి తమ వద్ద ఎన్నో ఆధారాలి ఉన్నాయని ఆచార్య మురళీధరశర్మ స్పష్టం చేశారు. సూర్యబింబం కోసం హనుమ వేంకటగిరి నుంచే గాల్లోకి ఎగిరాడని తెలిపారు. హనుమ తిరుమల కొండల్లోనే పుట్టాడని 12 పురాణాలు చెబుతున్నాయి పేర్కొన్నారు. 12, 13వ శతాబ్దం నాటి ఎన్నో రచనల్లో అంజనాద్రి ప్రస్తావన ఉందని తెలిపారు. వాల్మీకి రామాయణం తర్జుమా కంబరామాయణంలోనూ ఈ ప్రస్తావన ఉన్నట్లు స్పష్టం చేశారు. అన్నమయ్య కీర్తనల్లో వేంకటాచలాన్ని అంజనాద్రిగా వర్ణించారని ఆచార్య మురళీధరశర్మ వివరించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *