కేరళ లో మే 8 నుండి సంపూర్ణ లాక్‌డౌన్‌

 కేరళ లో మే 8 నుండి సంపూర్ణ  లాక్‌డౌన్‌

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్

భూమిపుత్ర, తిరువనంతపురం:

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల తీవ్రత తగ్గించడం కోసం ఈనెల 8 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలులో ఉంది. అదేవిధంగా వారాంతాల్లో సెమీ లాక్‌డౌన్‌ కూడా అమలు చేస్తున్నారు. తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం విజయన్‌ తెలిపారు. కేరళలో తాజాగా 41,953 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 17,43,932కు చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. ఇక కరోనా పాజిటివిటీ రేటులో స్వల్ప తగ్గుదల నమోదైంది. రాష్ట్రంలో టెస్ట్‌ పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నందున కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని విజయన్‌ తెలిపారు. కాగా కరోనా నియంత్రణ కోసం ఇప్పటికే చాలా రాష్ట్రాలు పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించాయి. వాటి దారిలోనే కేరళ కూడా లాక్‌డౌన్‌ ప్రకటించింది.

ప్రజల నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. రాష్ట్రంలో నెలకొన్న రోజువారీ డిమాండ్‌ దృష్ట్యా ఆక్సిజన్‌ నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని, ఈ నేపథ్యంలో మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. కరోనా రెండో దశ వ్యాప్తితో కేరళ తీవ్రంగా పోరాడుతోందని, కేసుల పెరుగుదల భారీగా ఉందని తెలిపారు. ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడేందుకు లిక్కర్‌ ఆక్సిజన్‌ అవసరం పెరుగుతోందని, రోజువారీ డిమాండ్‌ కారణంగా ప్రస్తుతం దాని స్టాక్‌ వేగంగా పడిపోతుందని విజయన్‌ తన లేఖలో వివరించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నిల్వల నుంచి కేరళకు వెంటనే వెయ్యి టన్నుల లిక్కర్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని విజయన్‌ మోడీని కోరారు. తక్షణం 500 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికిల్‌ ఆక్సిజన్‌ను అందించాన్నారు. మిగతా దాన్ని దగ్గర్లోని స్టీల్‌ ప్లాంట్‌ నుంచి సరఫరా చేయాలని కోరారు. ఆక్సిజన్‌తో పాటు 50 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు, 25 లక్షల కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతోండటంతో, ఆసుపత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్యను పెంచుతున్నారు. వైరస్‌ మహమ్మారి ప్రభావం భయంకరంగా ఉందని, పరిస్థితులు మరింత దిగజారే పరిస్థితి ఉందని విజయన్‌ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు హోటళ్లను కోవిడ్‌ సెంటర్లుగా మార్చింది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పలు ఆంక్షలు విధిస్తోంది.

Related News

Leave a Reply

Your email address will not be published.