ప్రపంచానికి సంజీవనిలా 2 డీ ఆక్సీ గ్లూకోజ్

 ప్రపంచానికి సంజీవనిలా 2 డీ ఆక్సీ గ్లూకోజ్

దేశ సమర్థతను చాటిన రక్షణరంగం

భూమిపుత్ర ,న్యూ ఢిల్లీ:

భారత రక్షణ మరియు పరిశోధన సంస్థ డీఆర్డీవో తయారు చేసిన కరోనా నివారణ ఔషధం ’2డీజీ’ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విడుదల చేశారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ ఈ ఔషధాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు ఇవ్వగా, హర్షవర్ధన్‌ దానిని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియాకు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ… కరోనా కట్టడిలో ఈ ఔషధం ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు కలిసి ఓ ఔషధాన్ని ఉత్పత్తి చేయడం ఆరోగ్యవంతమైన భాగస్వామ్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రకటించారు.దీనిని సైనిక రంగం సాధించిన ఘనతగా అభివర్ణించారు. దీంతో రానున్న రోజుల్లో కరోనాపై సమర్థవంతంగా పోరాటానికి అవకాశం ఏర్పడిందన్నారు.

ఇక కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ… 2డీజీ ఔషధంతో కొవిడ్‌ రికవరీ తగ్గడంతో పాటు ఆక్సిజన్‌ అవసరం కూడా తగ్గుతుందని, కోవిడ్‌ పై పోరులో డీఆర్డీవో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. అయితే ఈ ’2డీజీ’ (2`డియాక్సీ డి`గ్లూకోజ్‌) ఔషధ ధరను మాత్రం డీఆర్డీవో ఇప్పటి వరకూ ప్రకటించలేదు. దేశంలో కోవిడ్‌ ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో డీఆర్డీవో ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2`డీజీ డ్రగ్‌ భారత్‌ను మాత్రమే కాక ప్రపంచాన్ని కాపాడగలుగుతుంది అన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మద్దతుతో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన కోవిడ్‌ డ్రగ్‌ 2`డీజి మొదటి దేశీయ పరిశోధన ఆధారిత ఫలితం. దీని వినియోగం వల్ల కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడమే కాక ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గిస్తుంది. ఈ ఔషధం రాబోయే రోజుల్లో భారతదేశాన్ని మాత్రమే కాక మొత్తం ప్రపంచాన్ని కోవిడ్‌ బారి నుంచి కాపాడుతుందన్నారు. ఇక డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఈ ఔషధం పౌడర్‌ రూపంలో ఉంటుంది. దీన్ని నీటిలో కలుపుకుని నోటి ద్వారా తీసుకోవాలి. ఇది వైరస్‌ సోకిన కణాలలో పేరుకుపోయిన వైరల్‌ సంశ్లేషణ, శక్తి ఉత్పత్తిని ఆపడం ద్వారా వైరస్‌ పెరుగుదలను నిరోధిస్తుంది అని డీఆర్‌డీఓ తెలిపింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *