కడప జిల్లాలో ఘోర ప్రమాదం -క్వారీలో జిలిటెన్‌ స్టిక్స్‌ తరలిస్తుండగా పేలుడు

 కడప జిల్లాలో ఘోర ప్రమాదం -క్వారీలో జిలిటెన్‌ స్టిక్స్‌ తరలిస్తుండగా పేలుడు

పేలుడు ధాటికి పదిమంది సంఘటనా స్థలంలోనే  మృతి

భూమిపుత్ర,కడప:

కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తీరని విషాదం నింపింది. పదిమంది కూలీ కటుంబాలు అనాథయ్యాయి. కలసపాడు మండంలో మామిళ్లప్లలె గ్రామ శివారులో ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించింది. ముగ్గురాళ్ల గనిలో 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ముగ్గురాళ్లను తొలగించడానికి పేలుడు పదార్థాలను వినియోగించడంలో భాగంగా వాటిని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురాయి గనుల్లో జిలెటిన్‌స్టిక్స్‌ పేల్చడంతో పదిమంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.మృతులు గంగాయపల్లెకు చెందిన ప్రసాద్‌ (36), పులివెందులకు చెందిన బాల గంగులు (35), సుబ్బారెడ్డి (40), వెంకటరమణ (25), ప్రసాద్‌ (41)లుగా గుర్తించారు. ఇంకా పలువురి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం సంభవించేందేమోనని భయపడినట్లు వారు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ముగ్గురాయి గనుల్లో బ్లాస్టింగ్‌ కోసం వాహనంలో జిలెటిన్‌స్టిక్స్‌ తరలించారు. అన్‌లోడ్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సవిూపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిని ఎస్పీ అన్బురాజన్‌, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పేలుడు తీవ్రతకు కిలోవిూటర్‌ పరిధిలో మృతదేహాలు చెల్లాచెదురై పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని స్థానిక హాస్పిటల్‌ తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కడపలోని ప్రైవేట్‌ హాస్పిటల్‌ కి తరలించి ట్రీట్‌ మెంట్‌ అందిస్తున్నట్లు తెలిపారు పోలీసు. విషయం తెలిసిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విపిస్తున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఘటనపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటన జరగటానికి గల కారణాను జగన్‌ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు జగన్‌ మోహన్‌ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరమని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ బాధితుకు నష్టపరిహారం అందినట్లుగానే.. క్వారీలో మృతి చెందినవారికి కూడా అందించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనపై తెలుగుదేశం ఆంధప్రధేశ్‌ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా ఉద్ధృతిలో మైనింగ్‌కు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మృతు కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్‌ మాదిరిగానే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండు చేశారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందజేయాన్నారు. వివిధ పరిశ్రమలు, గనుల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు తెలిపారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *