ఇజ్రాయిల్‌లో తొక్కిసలాట – 40మంది మృతి

 ఇజ్రాయిల్‌లో  తొక్కిసలాట  – 40మంది మృతి

భూమిపుత్ర, అంతర్జాతీయం:

ఇజ్రాయేల్‌లో దారుణం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో కనీసం 40మంది మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. యూదు పవిత్ర స్థలం రబ్బీ షిమోన్‌ బార్‌ యోచాయ్‌ సమాధి వద్ద భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 40మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాయ్యాయి. లాగ్‌ బామెర్‌ పండుగ సెలవు సందర్భంగా రెండవ శతాబ్దం నాటి ఈ సమాధి వద్దకు వేలాది మంది సంప్రదాయక యూదులు తరలివచ్చారు. ప్రార్థనలు జరుగుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. స్టేడియంలోని ఓ చోట పైకప్పు కూలడంతో తొక్కిసలాట మొదలైందని భావిస్తున్నారు. ఘటనా స్థంలోనే 40మంది ప్రాణాలు కోల్పోయారనీ, ఆస్పత్రుల్లో మరింత మంది చికిత్స పొందుతున్నారని సహాయక కార్యక్రమాల ప్రతినిధి మాగెన్‌ డేవిడ్‌ అడోమ్‌ పేర్కొన్నారు. క్షతగాత్రులను తరలించేందుకు సైనిక, అత్యవసర సేవల విభాగాలు హెలికాప్టర్లను ఏర్పాటు చేశాయి. కాగా ఇది భారీ విపత్తు అంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *