వాయిదా పడ్డ ఐపీఎల్

 వాయిదా పడ్డ ఐపీఎల్

భూమిపుత్ర,క్రీడలు:

ఐపీఎల్ -2021 టోర్నీ లో పాల్గొంటున్న జట్లలోని పలువురు ఆటగాళ్ళకు కరోనా పాజిటివ్ రావడంతో ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. పలువురు ఆటగాళ్లకు మరియు సిబ్బందికి కరోనా సోకడంతో ఐపీఎల్‌ను వాయిదా వేయాలని నిర్ణయించారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ మేరకు ప్రకటించారు. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, వృద్దిమాన్ సాహా, అమిత్ మిశ్రా అలాగే బౌలింగ్ కోచ్ బాలాజీతో సహా ఇద్దరు ఆటగాళ్ళు, ఇద్దరు కోచింగ్ సిబ్బంది రెండు రోజుల్లో కరోనా బారిన పడ్డారు.

2021 ఏప్రిల్ 9 వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్ మే 30 వరకూ జరగాల్సి ఉంది. ఇప్పటివరకూ మొత్తం 29 మ్యాచ్ లు పూర్తయ్యాయి. నిన్న జరగాల్సిన 30 వ మ్యాచ్ ను వాయిదా వేశారు. ఈరోజు ఐపీఎల్ నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.ఈ ఐపీఎల్‌ రద్దు తో బోర్డుకు సుమారు 2000 కోట్ల నష్టం వాటిల్లనుందని సమాచారం.ఈ సంవత్సరం భారతదేశంలో నిర్వహించనున్న టి 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కు కూడా ఇలాంటి ప్రమాదం ఉండవచ్చనే అంచనా. భారతదేశం వెలుపల ఈ టోర్నీ నిర్వహించడానికి ఐసీసీ ప్రయత్నించే అవకాశం ఉంది. ఇది కూడా జరిగితే బీసీసీఐ కి మరింత నష్టం కలిగిస్తుంది.  బీసీసీఐ కి ప్రధాన ఆదాయ వనరు ఐపీఎల్ . దీని ద్వారా ప్రభుత్వం సకాలంలో పన్నును పొందుతోంది. 2007-08 నుండి బీసీసీఐ ద్వారా రూ .3500 కోట్లు పన్నుగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఈ లీగ్ నుండి బీసీసీఐ 40% ఆదాయాన్ని పొందుతుంది. బీసీసీఐ మధ్యలో ఐపీఎల్ రద్దు చేయడం వల్ల 50% అంటే సుమారు 2000 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశముంది . అక్టోబర్‌లో జరిగే ప్రతిపాదిత టీ-20 ప్రపంచ కప్‌కు కూడా బోర్డు ఆదాయం సమకూర్చుకోవాలి. బీసీసీఐ కి ఇది పెద్దదెబ్బగా చెప్పవచ్చు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *