వడ్డీరేట్లు యధాతథం- ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌

 వడ్డీరేట్లు యధాతథం- ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌

భూమిపుత్ర,న్యూ ఢిల్లీ:

కోవిడ్‌ రెండవదశ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారంనాడు జరిపిన ద్రవ్యపరపతి విధాన సవిూక్షలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు. రెపో రేటు 4 శాతంగా, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు (ఎంఎస్‌ఎఫ్‌), బ్యాంకు రేట్లు కూడా 4.25 శాతంగా కొనసాగుతాయని చెప్పారు. రెపో రేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఆరోసారి. కాగా, 2022 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనాను 9.5 శాతానికి ఆర్బీఐ తగ్గించింది. గతంలో ఇది 10.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. విస్తృత అంచనాలను అనుగుణంగానే ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాయథంగానే ఉంచింది.

గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2021 ఆర్థిక సంవత్సరానికి గాను సీపీఐ ద్రవ్యోల్బణం 5.1శాతంగా ఉండనుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.ఈసందర్భంగా జీ-సాప్‌ 2.0 ను శక్తికాంత దాస్‌ ప్రకటించారు. జూన్‌ 17న రూ.40వేల కోట్ల మేర సెక్యూరిటీలు కొనుగోలు చేస్తామన్నారు. ఫారిన్‌ కరెన్సీ రిజర్వ్‌లు 600 బిలియన్‌ డాలర్లకు చేరిందని, ఫలితంగా కరెన్సీ ఒడిదుడుకులు, ఇతర పరిణామాలను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని శక్తికాంతదాస్‌ చెప్పారు. అలానే దేశ జీడీపీని 9.5శాతంగా అంచనా వేశారు. దేశంలో గ్రావిూణ ప్రాంతంలో వినియోగ సంబంధింత డిమాండ్‌ మెరుగ్గా ఉండనుందనే ఆశాభావాన్ని గవర్నర్‌ వ్యక్తం చేశారు. ఇందుకు సకాలంలో వచ్చిన మాన్‌సూన్‌ నిదర్శనమన్నారు. ఆర్థిక వృద్ధికి అవసరమైన సంకేతాలు తగ్గినట్లు కన్పిస్తున్నా, గత ఏడాది కంటే ఎక్కువగానే ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగవంతం కావడంతో పాటు ఇప్పటికే ప్రకటించిన అనేక ఉద్దీపన ప్యాకేజీలు ఆర్థిక పురోగమనానికి దోహదపడతాయని చెప్పారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *