గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌

 గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌

పోలీస్‌ కాల్పులలో 13 మంది నక్సల్స్‌ మృతి

భూమిపుత్ర,ముంబై:

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎటపల్లి పరిధిలోని పేడి-కోటమి అటవీప్రాంతంలో మావోయిస్టు- పోలీసుల మధ్య శుక్రవారం త్లెవారుజామున భీకర కాల్పులు జరిగాయి. పోలీసు కాల్పులలో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఆరుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు గడ్చిరోలి డీఐజీ సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఘటనాస్థలంలో తుపాకులను, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీ-60 బెటాలియన్‌కు చెందిన పోలీసులు ఎటపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా నక్సల్స్‌ తారసపడటంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. కాల్పులు కొనసాగుతుండడంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పులకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *