గ్రూప్‌- 1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు

 గ్రూప్‌- 1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు

భూమిపుత్ర,అమరావతి:

గ్రూప్‌-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గురువారం నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు కూడా నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి కోర్టు ఆదేశాలిచ్చింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. కొద్దిసేపటి హైకోర్టు క్రితం తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్‌లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలిచ్చింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *