మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు – వాతావరణశాఖ హెచ్చరిక

 మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు – వాతావరణశాఖ హెచ్చరిక

భూమిపుత్ర,అమరావతి:

బంగాళాఖతంలో తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని, దీని ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, ఆంధప్రదేశ్‌, కేరళ రాష్టాల్లో 25 నుంచి 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడులో ఎల్లో అలర్ట్‌ కూడా జారీచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాయలసీమ, కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.

జలప్రళయంతో చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తాజాగా ఏర్పడిన మరో అల్పపీడనంతో ఎపి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈనెల 25-27 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌, ఆంధ్ర ప్రదేశ్‌లోని కోస్తాంధ్రా రాయలసీమలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ప్రకటించింది. ఈ ద్రోణి మధ్యస్థ ఆవరణ స్థాయి వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరం వైపు కదులుతుందని తెలిపింది.

Related News

Leave a Reply

Your email address will not be published.