ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వందనం – గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

 ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వందనం – గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ప్రారంభమైన శాసనసభా సమావేశాలు

భూమిపుత్ర, అమరావతి:

నేడు ప్రారంభమైన ఉభయ సభలనుద్దేశించి వర్చువల్‌ విధానంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. కోవిడ్ ను ఎదుర్కోవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అయన కొనియాడారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా ఉందన్నారు. ‘‘దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. సెకండ్‌ వే లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఏపీలోనూ ఉంది. కోవిడ్ పై పోరాడుతున్న ఫ్రంట్లైన్‌ వర్కర్లకు సెల్యూట్. కొత్తగా కోవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. ప్రతి ప్రైవేట్‌ ఆస్పత్రిలోనూ కోవిడ్‌ చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కింద ఏర్పాటు చేశాం. ఆక్సిజన్‌ కొరత లేకుండా ఇతర దేశాల నుంచీ క్రయోజనిక్‌ ఇంజన్లు, ఆక్సిజన్‌ తెప్పించామని గవర్నర్‌ తెలిపారు.కోవిడ్ కార‌ణంగా ఆదాయం త‌గ్గినా త‌మ ప్ర‌భుత్వం సంక్షేమ‌ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తుంద‌ని ఉటంకించారు. కోవిడ్ చికిత్స కోసం ప్ర‌తీ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి తీసుకొచ్చామ‌న్నారు.

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ప్ర‌వేశ‌పెడుతున్న మూడో బ‌డ్జెట్ ఇది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి మూడు నెలలకు గాను రూ.70,983 కోట్ల మేర ఓటాన్‌ అకౌంట్‌కు గతంలోనే కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో ఇపుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీకి స‌మ‌ర్పించ‌నున్నారు. ఇక ఈ ఏడాది బ‌డ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, జల వనరులు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం.. తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *