పెట్రో ధరా”ఘాతం”

 పెట్రో ధరా”ఘాతం”

మరోమారు పెరిగిన రేట్లు

భూమిపుత్ర ,న్యూ ఢిల్లీ:

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మే 4 తర్వాత ఈ మంగళవారం 13 వసారి పెరిగాయి. రాజధాని ఢిల్లీ లో పెట్రోల్‌ ధర 23 పైసలు, డీజిల్‌ ధర 25 పైసలు చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీ లో లీటరు పెట్రోల్‌ ధర రూ. 93.44 కు, లీటర్‌ డీజిల్‌ ధర రూ.84.32 కు చేరుకుంది. మే 4 తర్వాత ఇంధన ధరలో ఇది 13వ సారి చోటుచేసుకున్న పెరుగుదల. దీనికి ముందు పశ్చిమ బెంగాల్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 18 రోజులు ఇంధన ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. భారత్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం ఆయిల్‌ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం అన్ని నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరను ప్రకటిస్తాయి. వ్యాట్‌, సరుకు రవాణా ఛార్జీలు తదితర స్థానిక పన్నుల కారణంగా, ఇంధన ధరలు ప్రతి రాష్ట్రానికి మారుతుంటాయి. పెట్రోల్‌పై వ్యాట్‌ రాజస్థాన్‌లో అత్యధికం. దాని తరువాత మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ఉన్నాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *