తాడిపత్రి కోవిడ్‌ ఆస్పత్రిని ప్రారంభించిన సిఎం జగన్‌

 తాడిపత్రి కోవిడ్‌ ఆస్పత్రిని ప్రారంభించిన సిఎం జగన్‌

చిన్నపాటి వర్షానికే నీరు చేరడంతో ఆందోళన

భూమిపుత్ర,అమరావతి/అనంతపురం:

తాడిపత్రిలో 500 పడకల కోవిడ్‌ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా తాడిపత్రి సవిూపంలోని ఆర్జాస్‌ స్టీల్‌ వద్ద ఏర్పాటు 500 ఆక్సిజన్‌ పడకల జర్మన్‌ హ్యాంగర్ల ఆస్పత్రిని నిర్మించారు. సీఎం జగన్‌ ఆదేశాలతో 15 రోజుల్లో 13.56 ఎకరాల్లో రూ.5.50 కోట్లతో కోవిడ్‌ ఆస్పత్రిని నిర్మించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కోవిడ్‌ రోగుల 500 పడకల ఆస్పత్రి ప్రారంభానికి ముందే నీట మునిగింది.

తాడిపత్రి నియోజకవర్గం వ్యాప్తంగా నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో ఐదువందల పడకల ఆస్పత్రి ప్రాంగణమంతా జలమయం అయింది. ఇదే ఆస్పత్రిని శుక్రవారం వర్చువల్‌ విధానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. దీంతో ఆస్పత్రిలోని నీటిని మోటార్లతో బయటకు పంపారు. కొద్దిపాటి వర్షానికే ఆస్పత్రి జలమయం అయితే రోగులు వచ్చిన తర్వాత ఇలా జరిగితే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

 

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *