కరోనా మరణాలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు

 కరోనా మరణాలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు

మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి – రామకృష్ణ

భూమిపుత్ర, అమరావతి:

కరోనా మరణాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రామకృష్ణ విూడియాతో మాట్లాడుతూ ఒక్క మే నెలలోనే ఎపి లో 1.30 లక్షల మరణాలు సంభవించగా అందులో కేవలం మూడు వేల మంది మాత్రమే కరోనాతో మరణించారని సర్కారు చెప్పడం విడ్డూరమన్నారు. ఏటా మే నెలలో జరిగే సాధారణ మరణాల కంటే ఈ ఏడాది 400 శాతం అధికంగా మరణాలు సంభవించడం విచారకరమన్నారు. మే నెలలో రాష్ట్రంలో చోటు చేసుకున్న మరణాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *