ప్రకంపనలు సృష్టిస్తున్న ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌

 ప్రకంపనలు సృష్టిస్తున్న ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌

భూమిపుత్ర,సినిమా:

వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల మనసును రంజింపచేసే నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి జంటగా వచ్చిన ఫ్యామిలీ కమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మెన్‌’. రాజ్‌ అండ్‌ డీకే డైరెక్ట్‌ చేసిన ఈ వెబ్‌ సిరీస్‌ ఫిల్మ్‌ఫేర్స్‌ గెలుచుకుని మోస్ట్‌ వ్యూడ్‌ సిరీస్‌గా నిలిచింది. దీంతో రెండో భాగాన్ని మరింత పగడ్బందీగా ప్లాన్‌ చేసిన రాజ్‌ అండ్‌ డీకే ‘ది ఫ్యామిలీ మెన్‌’ సీజన్‌ 2 కోసం తెలుగు స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేనిని తీసుకున్నారు. ఈ సిరీస్‌ తోనే సామ్‌ డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చింది.మొదట ట్రైలర్‌ తోనే ఇంట్రెస్టింగ్‌ పెంచేసిన ఈ సిరీస్‌ కోసం ఇండియన్‌ ఓటిటి వీక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.అనుకున్నట్లుగానే మోస్ట్‌ అవైటెడ్‌ వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ ఎట్టకేలకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ కి వచ్చేసింది. ఇందులో సమంత రాజీ అనే శ్రీలంక తమిళియన్‌గా సరికొత్త క్యారెక్టర్‌లో కనిపించి ఇరగదీసింది. అయితే ఫ్యామిలీ మాన్‌ కి మాత్రం బాయ్‌ కాట్‌ కష్టాలు తప్పలేదు.

ఈ సిరీస్‌ ట్రైలర్‌ వచ్చిన కొత్తలోనే తమిళ ఆడియెన్స్‌ నుంచి కొంత వ్యతిరేకత మొదలైంది.దీంతో అప్పట్లో ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌ లో కూడా కొన్ని సన్నివేశాలను ప్రస్తావనకు రాకుండా చూసుకున్నారని ప్రచారం జరిగింది. మొత్తానికి సిరీస్‌ ఓటీటీలోకి వచ్చేయగా సిరీస్‌ పరంగా మంచి మార్కులే దక్కించుకుంది. కానీ తమిళ ప్రేక్షకులలో మాత్రం నెగిటివిటీ పీక్స్‌ కి చేరి సోషల్‌ విూడియాలో బాయ్‌ కాట్‌ ఫ్యామిలీ మాన్‌ 2 అంటూ ప్రచారం జరుగుతుంది. ఏకంగా ప్రైమ్‌ వీడియోను కూడా తొలగించాలని ట్విట్టర్లో ప్రచారం జరుగుతుంది.అసలు ఫ్యామిలీ మాన్‌ అని అంత పద్ధతిగా పేరు పెట్టుకున్న ఈ సిరీస్‌ కు ఎందుకీ కష్టాలు అంటే ఇందులో కొన్ని సన్నివేశాలు తమిళులకు వ్యతిరేకంగా ఉన్నాయని వారి వాదన. మరీ ముఖ్యంగా ఎల్టీటీఈపై చూపిన పలు సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, నిజానికి ఇందులో చూపినట్టు వాస్తవ పరిస్థితులు ఉండవని తమిళులు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి బాయ్‌ కాట్‌ ప్రచారం ఎంతవరకు వెళ్తుంది? సిరీస్‌ మేకర్స్‌ ఏమైనా ఫుల్‌ స్టాప్‌ పెడతారా అన్నది చూడాల్సి ఉంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *