ఉద్యోగాల భర్తీకి నిర్దిష్ట కాలపట్టిక

 ఉద్యోగాల  భర్తీకి నిర్దిష్ట కాలపట్టిక

ఎపిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన సిఎం జగన్‌

భూమిపుత్ర,అమరావతి:

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులకు క్యాలెండర్‌ను ప్రకటించారు. నిరుద్యోగులకు అండగా ఉండేలా మరిన్ని ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను సిఎం శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేవుని దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాం. 2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయి. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదు.

వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా 2.50లక్షలకు పైగా నిరుద్యోగులను భాగస్వామ్యం చేశాం. ఏపీలో ఇప్పటివరకు 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. మినిమమ్‌ టైం స్కేల్‌తో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీతాలు పెంచాం. 51,387 మంది ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాం. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాం. ప్యాకేజీ, ఓటుకు కోట్లు కేసు కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. గత ప్రభుత్వం మాటలతో భ్రమ కల్పించిన విషయం అందరికీ తెలుసు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంక్షేమం, అభివృద్ధి ఆగలేదు. ప్రభుత్వ ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, రైతులకు అండగా గ్రామాల్లో ఆర్బీకేలు నిలిచాయి. గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలను రాబోతున్నాయి. గ్రామాల అభివృద్ధి ఉద్యోగ విప్లవానికి నాంది పలుకుతుందని అన్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *