పరిసరాల పరిశుభ్రతా స్పృహను మరచిన ప్రజలు

 పరిసరాల పరిశుభ్రతా స్పృహను మరచిన ప్రజలు

భూమిపుత్ర, సంపాదకీయం:
కరోనా తొలిదశలో చేసిన దాడితో పోలిస్తే రెండవ దశ మరింత ఘోరంగా ఉంది. ప్రజలను భయందోళనలకు గురి చేస్తోంది. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. లెక్కలోకి రాని మరణాలు , కేసులు అనేకం ఉన్నాయి. ప్రజలు మరింత ఆందోళనకు గురికాకుండా ఉండేందుకు వాటిని దాచేస్తున్నారు. ఇకపోతే తొలిదశలో గతేడాది మార్చిలో అనేక చర్యలు తీసుకున్న ప్రభుత్వాలు ఈ రెండో దశలో అస్సలంటే అస్సలు పట్టించుకోవడం లేదు. ఎన్నికలు, ప్రచారాలు, కుంభమేళా లు యధావిధిగా నిర్వహించడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి పెద్దపీట వేశారు. పరిసరాలను ఎప్పటి కప్పుడు పరిశుభ్రం చేయించారు. వీధులను శానిటైజ్‌ చేసే చర్యలు పెద్ద ఎత్తున చేపట్టారు. కానీ సెకండ్‌వేవ్‌ అంతకన్నా తీవ్రంగా ఉన్నా ఎందుకనో అవేవిూ చేయడం లేదు. ప్రజను వారి మానాన వారిని వదిలేశారు. దీంతో కాలుష్యం మళ్లీ పెరుగుతోంది. ఎక్కడిక్కడ చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్‌ వాడకంతో కాలువల్లో అవన్నీ నిండి మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా తయారయ్యింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలు కూడా చెత్తను బయటకు విసిరేసి చోద్యం చూస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ తమ బాధ్యత కాదన్న రీతిలో కాలం గడిపేస్తున్నారు. చెత్త పేరుకుపోయిందని దీర్ఘాలు తీస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా పాలన సాగిస్తున్నాయి. అందుకే ఏటా మొక్కలు నాటుతున్నా..భూగర్బ జలాలు ఇంకేలా చేస్తున్నా..ఏయేటికాయేడు దేశంలో ఎండలు మండిపోతున్నాయి. పర్యావరణ విధ్వంసంపై దృష్టి పెట్టకపోవడంతో భానుడు చెలరేగిపోతున్నాడు. ఎండ వేడిమి, వడ గాడ్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉత్తరభారతం అయితే మరీ నిప్పుల కొలిమిలా తయారవుతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ యేడు చలికాలం వణికిస్తే..ఎండాకాలం ఉడికిస్తోంది. ఇలాంటి విపరీత వాతావరణ పరిస్థితులకు మనం చేస్తున్న విధ్వంసం కారణమని గుర్తించడం లేదు. పాలకులతో పాటు.. ప్రజలు కూడా ఇందుకు బాధ్యులే. కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. మేఘాలు తొలగిపోయి పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడడంతో సూర్యుని కిరణాలు నిటారుగా తాకుతుండటంతో రేడియేషన్‌ పెరిగి భూమి బాగా వేడెక్కి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కరోనా సెకండ్‌వేవ్‌ కూడా మనలను వెంటాడుతోంది. దీనిని కనీసం కొంతయినా తగ్గించడానికి కొంతమేరకు అయినా పరిసరాల పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం నిరంకుశంగా అయినా ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరించాలి. ఇకపోతే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇదంతా మనకుగా మనం చేసుకున్న పర్యావరణ విధ్వంసానికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవాలి. అడవులను నరకడం, కాంక్రీట్‌ జంగల్‌ను పెంచడం, మొక్కల పెంపకాన్ని విస్మరించడం, భూగర్భ జలాలను తోడేయడం, ఇసుకను తవ్వితీయడం వంటి అనేకానేక చర్యలు ఇందుకు కారణ మయ్యాయి.

దీనికితోడు పర్యావరణ విధ్వంసానికి తోడ్పడే ప్లాస్టిక్‌ విపరీతంగా వినియోగిస్తున్నాం. ప్లాస్టిక్‌ ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో ఎండను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏటా విధ్వంసం జరుగుతున్నా దానిని అడ్డుకునే కఠిన చర్యలను అవలంబించడం లేదు. ఎవరికి వారు మాకేంటి లే అన్న ధోరణిలో ఉన్నారు. ఇవే మనను అనేకానేక రోగాలకు కారణం చేస్తున్నాయి. కరోనా వైరస్‌ నివారణకు పరిశుభ్రత ముఖ్యమని హెచ్చరిస్తున్నా ప్రజలు చలించడం లేదు. ప్రచండ భానుడి ప్రతాపానికి దేశం అల్లాడుతోందని ఊరుకుంటే ఇకముందు కూడా ఇలాగే ఉంటుంది. ఇలాంటి అనేక అంటురోగాలు మనపై దాడి చేస్తాయి. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మంచినీటి సమస్య కూడా తీవ్రం అయ్యింది. ఇలాగే మనం ముందుకు సాగితే దేశం ఎడారిగా మారుతుందనడంలో సందేహం లేదు. దశాబ్దాుగా దేశంలో పర్యావరణ హితమైన చర్యలకు పాలకులు కట్టుబడకపోవడం వల్ల పచ్చదనం మాయమయ్యింది. పచ్చదనం అన్నది లేకుండా పల్లెల్లో ఉన్న చెట్లను ఎక్కడిక్కడ నరికి వేశారు. గతంలో ఇంటిముందు ఉండే చెట్లను కూడా డబ్బుకోసం అమ్ముకున్నారు. ఇప్పుడు చాలా గ్రామాల్లో కోతుల బెడద కారణంగా చెట్లను తెగ నరికేస్తున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాలు ఎండవేడిమికి అతలాకుతలం అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. మండే ఎండకు తోడు రెండు రాష్ట్రాల్లోను తాగునీటికి కటకట ప్రారంభం అయింది. మూడునుంచి నాుగు డిగ్రీలు సాధారణ ఉష్ణోగ్రతకు అదనంగా నమోదవుతుండటంతో ప్రజలు బేజారెత్తుతున్నారు. ఉదయం నుండే మొదవుతున్న ఎండవేడిమి సాయంత్రం అయినా ఎక్కడా తగ్గకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏటా ఎండాకాలం బాధలను వానాకాలంలో గుర్తుంచుకోక పోవడం వల్ల మంచినీటి సమస్యలు పునరావృతం అవుతున్నాయి. తాగునీరు కాదుకదా రోజువారీ వాడకానికి సరిపడా నీటికి కూడా కటకట తప్పడం లేదు. ప్రధాన జలాశయాలు అడుగంటి పోవడంతో భూగర్భ జలాలు పాతాళానికి చేరుకున్నాయి. పాలకులు కూడా కఠినంగా చర్యలు తీసుకుని పర్యావరణ విధ్వంసాన్ని ఆపకపోతే రానున్న రోజులు మరింత భయంకరంగా ఉండడం ఖాయమని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంతకాలం మనం చేసిన విధ్వంసం కారణంగానే అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనీసం ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటుతూ పోయినా కొంతయినా ఉపశమనం భించేది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే కరోనాలాంటి వైరస్‌లు ఇకముందు కూడా దాడి చేస్తాయని గుర్తించాలి. ప్రభుత్వాలను తిడుతూ కూర్చునే బదులు మన ఇంటినుంచే పరిశుభ్రత అన్నదానిని అవాటు కావాలి. మంచి అలవాట్లను ఊరూవాడా విస్తరింప చేసుకోవాలి. పాత అలవాట్లను పునరుద్దరిం చాలి. గతేడాది అవలంబించిన అవాట్లను మళ్లీ పాటించాలి. అప్పుడే కరోనా లాంటి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలం.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *