విశాఖపట్టణం పై ఆసక్తి కనపరుస్తున్న సినీ నటులు

 విశాఖపట్టణం పై ఆసక్తి కనపరుస్తున్న సినీ నటులు

భూమిపుత్ర,అమరావతి:

చిత్ర పరిశ్రమను తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు తరలించాలన్న ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి స్టూడియోలకు భూములు కేటాయించారు. పరిశ్రమకు చెందినవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్‌.టి.రామారావు వెంటనే ఇళ్లు కట్టుకోకపోతే ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకుంటామని హెచ్చరించడంతో ఇప్పటి ఫిల్మ్‌నగర్‌ అభివృద్ధి చెందింది. ఏపీ విడిపోయాక ఇప్పుడు ఏపీ లోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ది చేస్తామని అంటున్నారు. ఇటీవల సిఎం జగన్‌ను కలసిన వారు విశాఖలో భూముల ప్రస్తావన తెచ్చారు. వారంతా హైదరాబాద్‌లో స్థిరపడ్డవారే. ఇప్పుడు విశాఖలో ఇళ్ల స్థలాలు కావాలను కుంటున్నవారు హైదరాబాద్‌ వదిలి విశాఖలో ఇళ్లు కట్టుకుని స్థిరపడతామని చెప్పగలరా అన్నది కావాలి. రాజధాని విశాఖకు తరలిపోనుందన్న వార్తలతో కొందరు విశాఖలో కూడ స్టూడియోలు, స్థలాల కోసం ఎగబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతేడాది జగన్మోహన్‌రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులందరికీ హైదరాబాద్‌లో బ్రహ్మాండమైన భవంతులు ఉన్నాయి. తెలుగు ప్రజలు కరోనా వైరస్‌ కారణంగా ఇబ్బందులు పడుతుంటే చిరంజీవి నేతృత్వంలోని కొంతమంది సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసి తమకు విశాఖలో స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయించడంతో పాటు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని కోరారు. అంటే వీరంతా ముందుచూపు తోనే అలా చేశారా అన్నది ఇప్పుడు చర్చగా మారింది. విశాఖలో దివంగత నిర్మాత రామానాయుడు నిర్మించిన స్టూడియో ఇప్పటికీ ఖాళీగానే ఉంది. కరోనా కారణంగా మున్ముందు సినిమాల భవిష్యత్‌ ఏమిటో తెలియని స్థితిలో భూములు అడగటం ఎలా సమర్థనీయమా అని అపపట్లో విమర్శలు వచ్చాయి.

హైదరాబాద్‌లో ఉన్న స్టూడియోలే షూటింగులు లేక వెలవెలబోతున్నాయి. ఇక విశాఖలో స్టూడియోల అవసరం ఉంటుందా అన్నది అనుమానమే. షూటింగులకు అనుమతులు కావాలని కేసీఆర్‌, జగన్‌లను అర్థించారు. మంచిదే గానీ పెద్ద హీరోలుగా చలామణి అవుతున్నవారు ప్రస్తుత పరిస్థితులలో షూటింగులకు ఇష్టపడటం లేదు. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తానని జగన్‌ ప్రకటించి ఉంటే తమకు స్టూడియోల కోసం, ఇళ్ల స్థలాల కోసం ఇక్కడే కేటాయించాలని కోరేవారు. జగన్‌ చూపు విశాఖ వైపు ఉండడంతో ఇప్పుడు పరోక్షంగా వారు తమ మద్దతును తెలిపేలా జాగాలు అడిగారని అనుకోవాలి. కరోనా ఎఫెక్ట్‌ కారణంగా ఓటీటీ ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు పరిశ్రమ ఎలా ఉంటుందో తెలియదు. అయితే సినిమా వారు వస్తే ఆదరణ ఉంటుందన్న భ్రమలో ప్రభుత్వాలు కూడా ఉన్నాయి.

Related News

1 Comment

  • It’s i.e. above said demand and promise also need by our state giverment with a promise also through Gazette notification for un-change forever who implemented by present government decision
    Tq all team of this channel & present running goverment body

Leave a Reply

Your email address will not be published.