జనాభా నియంత్రణా విధానాలను మార్చుకుంటున్న చైనా

 జనాభా నియంత్రణా విధానాలను మార్చుకుంటున్న చైనా

పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా

భూమిపుత్ర, అంతర్జాతీయం:

ఏ విధానం ఎల్లకాలం సత్ఫలితాలను అందించదు. కొంతకాలం తరవాత పరిస్థితులు మారి ఆ విధానం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అందువల్ల కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మారడమే వివేకం అనిపించుకుంటుంది. అలా కాకుండా మొండిగా ముందుకెళ్లినట్లయితే దుష్ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది. ఇది వ్యక్తులకు, వ్యవస్థలకు, సంస్థలకు, దేశాలకూ వర్తిస్తుంది. అగ్రరాజ్య హోదా కోసం పరితపిస్తున్న అమెరికాను అనేక విషయాల్లో సవాల్‌ చేస్తున్న ఆసియా అగ్రరాజ్యం డ్రాగన్‌ దేశమైన చైనా ఇప్పుడు తన విధానాన్ని మార్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. జనాభా కు సంబంధించి ఇలాగే మొండిగా ముందుకెళితే ఎదురుదెబ్బలు తప్పవని గ్రహిస్తోంది.

 కొత్తగా అనసరించబోయే నూతన జనాభా విధానం వల్ల ఇప్పటికే 144, 38, 82,127 జనాభా గల చైనా మున్ముందు మరింత పెరగనుంది. అయినప్పటికీ ఆ దిశగానే సాగేందుకు నిర్ణయించింది.జనాభా పెరుగుదలపై ఇప్పటివరకు గల ఆంక్షను సడలించాని దేశ సెంట్రల్‌ బ్యాంకు (మన రిజర్వు బ్యాంకు వంటిది) అయిన పీపుల్స్‌ బ్యాంకు ఆఫ్‌ చైనా (పీబీఓసీ) విధాన పత్రం సూచించింది. మార్చి 26న 22 పేజీల ఈ విధాపత్రాన్ని రూపొందించింది. ఇటీవల ఈ విషయం మెగులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో ఒకే సంతానం అన్న నిబంధన అమల్లో ఉంది. జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు 1979లో ఒక జంటకు ఒక సంతానం అన్న సూత్రాన్ని అమలు చేసింది. ప్రస్తుతం దేశంలో సంతానోత్పత్తి రేటు 1.5 శాతంగా ఉంది. 2019లో జననరేటు ప్రతి వెయ్యిమందిలో 10.489 శాతానికి పడిపోవడం గమనార్హం. తాజాగా దంపతులు ఇద్దరు లేదా ముగ్గురు ప్లిల్ని కనేందుకు అనుమతించాలని సూచించింది.ఒకే సంతానం విధానం వల్ల దేశంలోవయోధికుల జనాభా పెరిగింది. వారి బాగోగులు చూసే వారే కరవయ్యారు. ఉన్న ఒక్క సంతానం ఉత్పత్తి పనుల్లో నిమగ్నం కావడం వల్ల పెద్దల సంక్షేమాన్ని చూసే వారు లేకుండాపోయారు.

ఇది ఒక కోణం.మరో కోణంలో చూసినప్పుడు ఈ సమస్య దేశ ప్రగతిని దెబ్బ తీస్తుందని, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని పీపుల్స్‌ బ్యాంకు ఆఫ్‌ చైనా విధాన పత్రం ఆందోళన వ్యక్తం చేసింది. సంతానోత్పత్తిపై నియంత్రణ కొనసాగిస్తే 2050 నాటికి చైనా జనాభా2 శాతం తగ్గుతుందని ఈ విదాన పత్రం నిర్దిష్టంగా అంచనా వేసింది. జనాభాపై నియంత్రణను కొనసాగించినందున 1979 నుంచి దాదాపు 400 మిలియన్ల జననాలను అడ్డుకున్నట్లు స్పష్టం చేసింది.పొరుగున ఉన్న భారత్‌ లో సంతానోత్పత్తిపై ప్రభుత్వపరంగా కఠినమైన నియంత్రణలు లేవు. దీంతో యువకుల జనాభా ఎక్కువగా ఉంది. వీరు తమకు న్నంతలో పెద్దల బాగోగులను చూసుకుంటున్నారు. దీనివల్ల వయోధికులకు సాంత్వన కలుగుతుంది. అదే సమయంలో యువకులు పెద్దయెత్తున ఉత్పత్తి కార్యకలాపాల్లో భాగస్వాములు అవుతున్నారు.

చైనా దేశపు జనసాంద్రత

ఇది పరోక్షంగా దేశ ప్రగతికి దోహద పడుతోంది.పెరుగుతున్న యువకుల జనాభా దేశానికి అతి పెద్ద వనరుగా మారింది. అగ్రరాజ్యమైన అమెరికాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2019లో అమెరికా కంటే చైనా శ్రామిక శక్తి 5.4 శాతం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో 2035, 2050 నాటికి ప్రకటిత లక్ష్యాల సాధనకు, అమెరికా, భారత్‌ తో పోటీపడటం కష్టమవుతుందని పీబీఓసీ విధాన పత్రం అంచనా వేసింది. తొలి రోజుల్లో చైనా కన్నా భారత ప్రగతిరేటు పరిమితంగా ఉండేది. ఇటీవల కాంలో చైనాతో భారత్‌ పోటీపడుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌, అమెరికా నుంచి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు తన విధానాన్ని మార్చుకునేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా సంతానోత్పత్తిపై నియంత్రణ తొలగించే దిశగా బీజింగ్‌ కసరత్తు చేస్తోంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *