సముద్రంలో కూలిన చైనా రాకెట్ “లాంగ్ మార్చ్ – 5 బి”

 సముద్రంలో కూలిన చైనా రాకెట్  “లాంగ్ మార్చ్ – 5 బి”

భూమిపుత్ర,అంతర్జాతీయం:

ప్రపంచానికంతటికీ ముచ్చెమటలు పట్టించిన చైనా రాకెట్ లాంగ్ మార్చెట్- 5 బి మాల్దీవుల దగ్గర హిందూ మహాసముద్రంలో కూలినట్లు చైనా అంతరిక్ష కేంద్రం సామాజిక మాధ్యమాలలో సమాచారాన్ని వెల్లడించారు.శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకై చైనా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గత ఏప్రిల్ 29 న వెన్చాంగ్ ప్రయోగ కేంద్రం నుండి లాంగ్ మార్చ్-5 బి రాకెట్ ద్వారా టియాన్హే మాడ్యూల్ ను ప్రయోగించింది. ఇందులో సిబ్బందికి నివాసగృహాలు కూడా ఉండడం దీని ప్రత్యేకత.ప్రస్తుతం కక్ష్యలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) మాత్రమే ఉంది. చైనా ఇందులో భాగంగా లేదు.

అంతరిక్ష పరిశోధనల రంగంలో  కాస్త ఆలస్యంగా ప్రవేశించిన చైనా తన తొలి వ్యోమగామిని కక్ష్యలోకి తొలి సారి 2003లోనే పంపింది. అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపిన దేశాల్లో సోవియెట్ యూనియన్, అమెరికాల తర్వాత చైనా మూడవ స్థానంలో ఉంది.ఇప్పటి వరకు చైనా కక్ష్యలోకి రెండు అంతరిక్ష కేంద్రాలను పంపింది. అందులో టియాంగాంగ్ -1, టియాంగాంగ్ -2 ట్రయల్ స్టేషన్లలో వ్యోమగాములకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉండటానికి అనుమతించాయి.66-టన్నుల మల్టీ-మాడ్యూల్ టియాంగాంగ్ స్టేషన్ కనీసం 10 సంవత్సరాలు పని చేసే విధంగా రూపొందించారు.అందులో టియాన్హే కీలకమైనది. ఇది 16.6 మీటర్ల పొడవు , 4.2 మీటర్ల వెడల్పు ఉంటుంది.ఇది వ్యోమగాములకు అవసరమైన పవర్, ప్రొపల్షన్, లైఫ్ సపోర్ట్ సాంకేతికతతో పాటు వారు నివసించేందుకు కూడా వీలుంటుంది.

చైనా అంతరిక్ష కేంద్రం

వచ్చే సంవత్సరం ఈ అంతరిక్ష కేంద్రం నిర్మాణం పూర్తయ్యే లోపు ఇలాంటి మరో 10 ప్రయోగాలను చేయడం ద్వారా అవసరమైన అదనపు పరికరాలను కక్ష్యలోకి చేర్చాలని బీజింగ్ భావిస్తోంది. ఇది భూమికి 340 – 450 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ లో పరిభ్రమిస్తుంది.ప్రస్తుతం కక్ష్యలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను రష్యా, అమెరికా, కెనడా, యూరోప్, జపాన్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో చైనాను చేరనివ్వకుండా ఆయా దేశాలు అడ్డుకున్నాయి.ఐఎస్ఎస్ 2024లో కక్ష్య నుంచి రిటైర్ అయ్యే సమయానికి, టియాంగోన్గ్ మాత్రమే కక్ష్యలో ఏకైక అంతరిక్ష కేంద్రంగా మిగులుతుంది.ఏప్రిల్ 29న భూమి నుంచి బయలుదేరిన చైనా స్పేస్ స్టేషన్‌ తియాన్హే (Tianhe)కి చెందిన కోర్ మాడ్యూల్‌ని మోసుకెళ్లిన లాంగ్ మార్చ్ 5B రాకెట్ దారి తప్పింది.

నేడు   అది భూమిపై కూలిపోయింది. అది ఎక్కడ పడుతుందా అని వారం నుంచి శాస్త్రవేత్తలు, చైనా ప్రభుత్వం, ప్రపంచ ప్రజలు ఆందోళన చెందారు.శకలాలేవి భూమిని తాకనందున ప్రమాదమేమీ లేదని చైనా వాదన.నిజానికి ఈ భారీ రాకెట్ ఎంత ప్రాణ, ఆస్తి నష్టం కలుగజేస్తుందోనని అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్లయింది.దాని శకలాలు హిందూ మహాసముద్రంలో కూలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీని స్టాస్టిటికల్ ఛాన్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఈ భయం మాత్రం తగ్గలేదు. అమెరికన్, యూరోపియన్ అంతరిక్ష పరిశోధకులు ఇది ఎక్కడ పడుతుందోనని ఎప్పటికప్పుడుదాని గమనాన్ని అంచనా వేస్తూ వచ్చారు.. దీన్ని పేల్చివేసి కిందకు కూల్చాలన్నది తమ ఉద్దేశం కాదని, కానీ ఇది కక్ష్య నుంచి కింద పడకుండా చూడడంలో చైనా నిర్లక్ష్యం వహించిందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటిలాగే గత ఏడాది లాంగ్ మార్చ్ రాకెట్ కి చెందిన మరో రాకెట్ ఐవోరీ కోస్ట్ లోని కొన్ని గ్రామాలపై పడింది.ఆస్తి నష్టం జరిగినా అదృష్టం కొద్దీ ప్రాణనష్టమేమీ జరగలేదు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *