వీవీ లక్ష్మీనారాయణ దారెటు?

 వీవీ లక్ష్మీనారాయణ దారెటు?

భూమిపుత్ర,విశాఖపట్టణం:

రాజకీయాలలో రాణించడం ఒక కళ . అది అందరికీ సాధ్యం అయ్యే పనికాదని అంటారు అనుభవజ్ఞులు. అయితే రాజకీయాల్లో ఎలాగైనా రాణించేయొచ్చని భావించిన కొందరు ఉన్నతస్థాయి అధికారులు రిటైర్ అయిన తర్వాత కొందరు ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి మరికొందరు రాజకీయ రంగంలోకి వచ్చారు . అయితే వీరిలో ఎందరు రాణిస్తున్నారు ? అనే దానికి సమాధానం ఉంచడం లేదు.ఒకరిద్దరు తప్ప చాలా మంది ఇలా వచ్చిన వారు రాజకీయంగా ఎదురీత ఈదుతున్నారనే చెప్పాలి.గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసిన మాజీ సీబీఐ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఓటమి పాలయ్యారు . ఆయన ఐపీఎస్ అధికారిగా , విధులపట్ల నిబద్ధత గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి టీడీపీ గూటికి చేరాలనుకుని ఆనక రాజకీయ దుమారం చెలరేగడంతో పవన్ బడిలో చేరి తన భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు .

నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తానని , ప్రజలకు పనిచేసి పెడతానని ఆయన పేర్కొన్నారు . ఎన్నికల సమయంలో ఏకంగా 100 రూపాయల స్టాంపు పేపర్ పై హామీలు గుప్పించారు . అయితే ఓటమి తర్వాత ఏకంగా పార్టీకే దూరమయ్యరు . పార్టీ విధానాలు తనకు నచ్చలేదన్నారు . ఇప్పుడు ఎటూ కాకుండా తటస్థంగా ఉన్నారు . ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నారు . ఇక , గుంటూరు వెస్ట్ నియోజవర్గం నుంచి వైసీపీ టికెట్ పై పోటీ చేశారు మాజీ ఐపీఎస్ చంద్రగిరి ఏసురత్నం .డీఐజీగా పనిచేసి .. రిటైర్ అయ్యారు . గత ఎన్నికల్లో ఆయన కూడా నిజాయితీ ప్రవచనాలే వల్లె వేశారు. . ప్రస్తుతం మిర్చియార్డు చైర్మన్ గా ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నా కష్టమే అంటున్నారు వైసీపీ నాయకులు .. ఇక , ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేసిన బీ . దినేష్ రెడ్డి కూడా 2014 ఎన్నికల్లో వైసీపీలో చేరారు . ఈ క్రమంలోనే తెలంగాణలోని మల్కాజిగిరి నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు . ఆ తర్వాత వైసీపీకి దూరమయ్యి బీజేపీ లో ఉన్నారు . ఇలా చాలా మంది ఐపీఎస్ లు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఎటు కాకుండా పోయారనే వాదన ఉంది . దీంతో రాజకీయాల్లో రావాలని అనుకున్న ఉన్నతాధికారులు సైతం వెనుకడుగు వేస్తున్నారు .

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *