గుంటూరులో దారుణం – బిటెక్‌ విద్యార్థినిని హత్య చేసిన దుండగుడు

 గుంటూరులో దారుణం – బిటెక్‌ విద్యార్థినిని హత్య చేసిన దుండగుడు

రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

భూమిపుత్ర,గుంటూరు:

గుంటూరులో మారో దారుణం చోటుచేసుకుంది. బీటెక్‌ విద్యార్థిని హత్యకు గురైంది. విద్యార్థినిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. పొట్ట, గొంతులో 6 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థిని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై అర్బన్‌ ఎస్పీ హఫీజ్‌ దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన యువతి సెల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌ ఓపెన్‌ చేస్తే హత్య కేసులో కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
జీజీహెచ్‌లో విద్యార్థి మృతదేహాన్ని నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అందరు స్వాతంత్య దినోత్సవ వేడుకలలో ఉండగా ఈ దారుణ ఘటన జరిగిందని, నిందితుడిని తక్షణమే పట్టుకోవాలని పోలీసులకు సూచించా నన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులకు అండగా ఉంటామని మనహార్‌ నాయుడు అన్నారు. బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థిని యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *