బ్రీత్‌ అనలైజర్‌తో కరోనా గుర్తింపు

 బ్రీత్‌ అనలైజర్‌తో కరోనా గుర్తింపు

బ్రీత్‌ అనలైజర్‌

అభివృద్ది చేసిన సింగపూర్‌ పరిశోధకులు

భూమిపుత్ర,సాంకేతికం:

ఒక్క నిమిషంలోనే కరోనాను గుర్తించే వినూత్న సాధనాన్ని సింగపూర్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది ఒక వ్యక్తి శ్వాసను విశ్లేషించి, కరోనా ఆనవాళ్లను పట్టేస్తుంది. ఈ పరీక్షకు సింగపూర్‌ ప్రభుత్వం తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. బ్రీత్‌ ఎనలైజర్‌ తో మద్యం సేవించిన వాహనాలను నడుపుతున్న వారిని గుర్తిస్తారు. అదేరీతిలో ఒక్క నిమిషంలోనే కొవిడ్‌-19ను గుర్తించే ఓ వినూత్న సాధనాన్ని సింగపూర్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది ఒక వ్యక్తి శ్వాసను విశ్లేషించి, కరోనా ఆనవాళ్లను పట్టేస్తుంది. ఈ సాధనాన్ని అభివృద్ధి చేసిన బృందంలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్‌ టి.వెంకీ వెంకటేశన్‌ కూడా ఉన్నారు.

నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌(ఎన్‌యూఎస్‌)కు అనుబంధంగా ఏర్పడ్డ బ్రీతోనిక్స్‌ అనే అంకుర సంస్థ ఈ సాధనాన్ని రూపొందించింది. వెంకటేశన్‌తో కలిసి ఎన్‌యూఎస్‌ గ్రాడ్యుయేట్లు జియా ఝనాన్‌, డు ఫాంగ్‌, వేన్‌ మీ దీన్ని ఏర్పాటు చేశారు. ఒక్కసారి వాడిపారేసే మౌత్‌ పీస్‌లోకి శ్వాసను వదలాల్సి ఉంటుంది. మౌత్‌ పీస్‌కు అత్యంత కచ్చితత్వంతో కూడిన బ్రెత్‌ శాంపిలర్‌ సంధానమై ఉంటుంది. ఇందులోకి వచ్చిన శ్వాస నమూనా తర్వాత మాస్‌ స్పెక్టోమీటర్‌లోకి వెళుతుంది ఆ సాధనం. శ్వాసలోని వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ (వీవోసీ)ను విశ్లేషిస్తుంది. వాటి ఆధారంగా నిమిషం కన్నా తక్కువ సమయంలోనే ఫలితాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ఈ సాధనం ద్వారా కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి పీసీఆర్‌ పరీక్ష కూడా చేసి, ఇన్‌ఫెక్షన్‌ను నిర్దారిస్తున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *