మరోమారు రగులుకున్న సరిహద్దు వివాదం

 మరోమారు రగులుకున్న సరిహద్దు వివాదం

ఆంధ్రప్రదేశ్ ,హైదరాబాద్‌:

తెలంగాణా, ఆంధ్ర మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద ధాన్యం లారీలను అడ్డగిస్తున్నారు తెలంగాణా పోలీసులు. అర్థరాత్రి నుంచి ధాన్యం లారీలను తెలంగాణాలోకి అనుమతించడం లేదు. ముందస్తు సమాచారం లేకుండా ఒక్క సారిగా ధాన్యం లారీలను నిలిపివేస్తే నష్టపోతామంటున్నారు వ్యాపారులు. ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న వివాదం నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేక చెక్‌ పోస్టును ఏర్పాటు చేసింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద అర్థరాత్రి నుంచి ధాన్యం లారీలను నిలిపివేస్తున్నారు తెలంగాణా పోలీసులు.

తెలంగాణా రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి లారీని తనిఖీ చేసి ధాన్యం, బియ్యం ఉన్న లారీలను అడ్డుకుంటున్నారు. దీంతో అర్థరాత్రి నుంచి భారీగా ధాన్యం, బియ్యం లారీలు నిలిచిపోయి. పక్కరాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యానికి తెలంగాణా రాష్ట్రంలో అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ముందస్తులు నోటీలు, సమాచారం ఇవ్వకుండా ఒకే సారి ధాన్యం లారీలను నిలిపివేయడం సరైంది కాదని, తాము భారీగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. ఆంధ్రప్రదేశ్‌ లోని నంద్యాల, కర్నూలు, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల నుంచి ఆర్‌ఎన్‌ఆర్‌ రకం వరి ధాన్యం తెలంగాణా లోని హైదరాబాద్‌ కు నిత్యం వందలాది లారీలు వెళుతుంటాయి. వందల టన్నుల ధాన్యం, బియ్యం రాజధాని హైదరాబాద్‌ కు ప్రతి సంవత్సరం తరలి వస్తుంది. ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా సన్న రకం ధాన్యం, బియ్యం హైదరాబాద్‌ కు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య మరో వివాదానికి తెర లేచిందని చెప్పాలి.

Related News

Leave a Reply

Your email address will not be published.