జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు

 జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు

భూమిపుత్ర, శ్రీనగర్‌ :

జమ్ముకశ్మీర్‌లోని జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.50 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టులోని ఏర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద పేలుడు సంభవించింది. దీంతో ఫోరెన్సిక్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బాంబు డిస్పోజల్‌ బృందాలు కూడా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల కొంతమంది గాయపడినట్లు సమాచారం. అయితే ఎందుకు, ఎలా సంభవించాయనే విషయాలు తెలియాల్సి ఉన్నది.శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరా తీశారు.

వైస్‌ ఎయిర్‌ చీఫ్‌, ఎయిర్‌ మార్షల్‌ హెచ్‌ఎస్‌ అరోరాతో ఫోన్‌లో మాట్లాడారు. మరో ఉన్నతాధికారి ఎయిర్‌ మార్షల్‌ విక్రమ్‌ సింగ్‌ను సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సవిూక్షించమని ఆదేశించారు.జమ్ముకశ్మీర్‌ విమానాశ్రయంలో శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి విమానాశ్రయంలోని ఓ భవనం పైకప్పు పూర్తిగా దెబ్బతిన్నది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ముష్కరులు డ్రోన్‌ల సాయంతో బాంబులు జారవిడిచినట్లు వెల్లడిరచారు.పేలుళ్ల సమాచారం అందగానే బాంబు స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ బృందాలు వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు ప్రారంభించాయి. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు ముమ్మరంగా గాలింపు కొనసాగుతున్నది. జమ్ము విమానాశ్రయం రన్‌వే, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థ పూర్తిగా ఐఏఎఫ్‌ నియంత్రణలో ఉంటాయి. అందుకే ఈ ఐఏఎఫ్‌ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు జరపుతున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *