ఎంపీ రఘురామరాజు కు బెయిల్‌ మంజూరు

 ఎంపీ రఘురామరాజు కు బెయిల్‌ మంజూరు

షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిన సుప్రీం

విూడియాతో మాట్లాడరాదని ఆంక్షలు

భూమిపుత్ర ,న్యూ ఢిల్లీ:

నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సుప్రీంలో బెయిల్‌ పిటిషన్‌ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జావిూనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్‌ తీసుకోవచ్చని పేర్కొంది. గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి బెయిల్‌ తీసుకోవాలని సూచించింది. ఇకపోతే దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెళ్లాలని, అలాగే న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి విూడియాతో మాట్లాడకూడదు. దర్యాప్తును ప్రభావితం చేయకూడదని సూచించింది. విూడియా, సోషల్‌ విూడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని కూడా తెలిపింది. గతంలో చూపించినట్లు తన గాయాలను ఎక్కడా ప్రదర్శించకూడదని కూడా తెలిపింది. నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తా మని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు రఘురామను అరెస్ట్‌ చేశారు. ఇతరులతో కసి కుట్రలు చేయడం (ఐపీసీ సెక్షన్‌ 120 బీ), ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం (124ఏ), ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా మాట్లాడటం (153ఏ), వ్యక్తిగత దూషణలు (505) తదితర అభియోగాల కింద అరెస్టు చేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు. అయితే ఆ నోటీసును తీసుకునేందుకుగానీ సంతకం చేసేందుకుగానీ రఘురామ అంగీకరించలేదని, ఆయన భార్య రమాదేవి కూడా నోటీసులు తీసుకునేందుకు నిరాకరించడంతో ఇంటి గోడకు అంటించామని పోలీసులు దానిపై రాశారు. ఆయనపై మంగళగిరి సీఐడీపోలీసులు కేసు (12/2021) నమోదు చేసినట్లు నోటీసులో ఉంది. ఈ మేరకు ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంలో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కేసులో కీలక అంశాలను రఘురామ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గి కోర్టుకు విన్నవించారు. టార్చర్‌ పెట్టి మెజిస్టేట్ర్‌ ముందు హాజరుపర్చారని రఘురామ తనతో చెప్పారని ఆయన అన్నారు.

చాలా సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యిందని రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిలో సెక్షన్‌ 124ఏ చాలా ముఖ్యమైందని బెయిల్‌ రాకూడదనే ఉద్దేశంతోనే సెక్షన్‌ 124ఏ కింద నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఎంపై డజన్‌కు పైగా కేసు ఉన్నాయంటూ కోర్టుకు రోహత్గి విన్నవించారు. “రఘురామకృష్ణరాజు ఏపీలో అధికార పార్టీకి చెందిన ఎంపీ. ప్రభుత్వానికి, సీఎంకు అనేక విషయాల్లో సూచనలు చేశారు. కానీ సీఎం వాటిని పట్టించుకోలేదు. ఒక రెడ్డి కులానికే ప్రాధాన్యత కల్పిస్తూ వెళ్లారు. ఈ అంశాలపై విమర్శు చేస్తూ వచ్చారు. అలాగే సీఎం బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేశారని” ముకుల్ తన వాదనలు వినిపించారు. దవే తన వాదనలు వినిపిస్తూ ఇందులో సీఎం ప్రతివాది కాదు. ఆయనను ఇందులోకి లాగవద్దు. సీఎంపై ఆరోపణలు చేయాంటే ఆయన్ను ప్రతివాదిగా చేర్చండన్నారు. మే 14న గుంటూరు పోలీస్‌ స్టేషన్లో ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేశారని,సీఐడీ ఏడీజీ స్వయంగా ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేశారని రోహిత్గి తెలిపారు. సీఐడీ ఏడీజీ ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి, ఆ రిపోర్ట్‌ ఆధారంగా ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేశానని చెబుతున్నారు. చాలా సెక్షన్లు పెట్టారు. బెయిల్‌ రాకుండా చేయడం కోసం ఐపీసీ 124(ఏ) కూడా పెట్టారు. మే 14న రఘురామ పుట్టినరోజు. ఆ రోజు అరెస్టు చేసి 300 కి.విూ దూరం తీసుకెళ్లారు. రఘురామను చిత్రహింసలు పెట్టి మేజిస్టేట్ర్‌ ముందు హాజరుపరిచారని ఆయనకు బెయిల్ ఇవ్వాలని వాదించారు

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *