ఆంధ్రప్రదేశ్

నిమ్మగడ్డకు మరోసారి నోటీసులు!!

భూమిపుత్ర,విజయవాడ: రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పై ప్రభుత్వం మరోసారి కేసులు తిరగదోడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనపై ప్రివిలేజ్‌ కమిటీలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఉంది. గతంలోనే ఆయనకు ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది. అయితే కరోనా తీవ్రత కారణంగా ఇప్పటి వరకూ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ విషయాన్ని పక్కన పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా తీవ్రత తగ్గిన వెంటనే ప్రివిలేజ్‌ కమిటీ తిరిగి నోటీసులు జారీ […]వివరాలు ...

సినిమా

క్రీడా నేపథ్యమున్న చిత్రాలకు ప్రాధాన్యం- కియారా

భూమిపుత్ర, సినిమా: అలనాటి అగ్రనాయిక మధుబాల జీవితకథలో నటించాలన్నది తన చిరకాల స్వప్నమని చెప్పింది కియారా అద్వాణీ. కిక్‌ బాక్సింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌లో తనకు ప్రవేశముందని, ఈ ఆటలకు సంబంధించి తనలో ఉన్న నైపుణ్యాల్ని వెండితెరపై ప్రదర్శించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. కథానాయికగా అరంగేట్రం చేసి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల అభిమానులతో ముచ్చటించింది కియారా అద్వాణీ. ఈ వేడుకలో సినిమాల విషయంలో తన కలల్ని గురించి కియారా అద్వాణీ వెల్లడిస్తూ ’కమర్షియల్‌ సినిమాలతో పోలిస్తే […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

జిందాల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ వచ్చే నెలలో ప్రారంభం

ప్రాజెక్టును సందర్శించిన మంత్రి బొత్స భూమిపుత్ర,గుంటూరు: జిందాల్‌ ప్లాంట్‌ 2016లో ప్రారంభించి పద్దెనిమిది నెలలో పూర్తి చేయాలన్నారని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్లాంట్‌ ప్రారంభ దశకు వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వచ్చే నెలలో ప్లాంట్‌ ప్రారంభిస్తామని చెప్పారు. పదిహేను మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రభుత్వమే యూనిట్‌ రూ.6.18 కొనుగోలు చేస్తామని చెప్పారు. కాలుష్యం సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, చుట్టు పక్కల ప్రాంతాల వారికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. చుట్టు […]వివరాలు ...

సాంకేతికం

మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల

జాన్‌ థాంసన్‌ స్థానంలో సత్య నియామకం ఆమోదం తెలిపిన మైక్రోసాఫ్ట్‌ బోర్టు భూమిపుత్ర,సాంకేతికం: భారత సంతతికి చెందిన, తెలుగు తేజం సత్య నాదెళ్ల మరో ఘనతను సాధించారు. టెక్‌ దిగ్గజం మైక్రోసాప్ట్‌ నూతన ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ జాన్‌ థామ్సన్‌ స్థానంలో, ప్రస్తుత సీఈవోను కొత్త ఛైర్మన్‌గా కంపెనీ ఎంపిక చేసింది. 2014 లోమైక్రోసాప్ట్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల మైక్రోసాప్ట్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ […]వివరాలు ...

క్రీడలు

సాగర్‌ రాణా హత్య కేసు జూడో కోచ్‌ సుభాష్‌ అరెస్ట్‌

భూమిపుత్ర,క్రీడలు: జూనియర్‌ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్యకేసు మరో మలుపు తీసుకుంది. హత్య కేసుతో జూడో కోచ్‌ సుభాష్‌కు సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ఢిల్లీ కైమ్ర్‌ బ్రాంచ్‌ పోలీసులు బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఒలింపియన్‌ సుశీల్‌ కుమార్‌కు సుభాస్‌ జూడోకోచ్‌గా వ్యవహరించారు. ఇప్పటికే సాగర్‌ రాణా హత్య కేసులో సుశీల్‌ కుమార్‌తో పాటు అతని సన్నిహితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇటీవలే సుశీల్‌ కస్టడీని జూన్‌ 25 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కోర్టు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

గ్రూప్‌- 1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు

భూమిపుత్ర,అమరావతి: గ్రూప్‌-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గురువారం నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు కూడా నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి కోర్టు ఆదేశాలిచ్చింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. కొద్దిసేపటి హైకోర్టు క్రితం తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్‌లో కౌంటర్లు […]వివరాలు ...

జాతీయం

మిజోరాంలో ఆశ్రయం పొందిన మయన్మార్‌ నేత

ఓ వార్తా సంస్థ ప్రకటనతో వివరాలు వెల్లడి భూమిపుత్ర ,మిజోరాం: మయన్మార్‌లోని చిన్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి సలాయ్ లియాన్‌ లువాయి భారత దేశంలోని మిజోరాంలో ఆశ్రయం పొందారు. మయన్మార్‌ సైన్యం తిరుగుబాటు చేసి, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దె దించిన నేపథ్యంలో ఆ దేశం నుంచి దాదాపు 9,000 మంది పారిపోయారు. వీరిలో చిన్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి ఒకరు. మిజోరాం రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

విశాఖపట్టణం పై ఆసక్తి కనపరుస్తున్న సినీ నటులు

భూమిపుత్ర,అమరావతి: చిత్ర పరిశ్రమను తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు తరలించాలన్న ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి స్టూడియోలకు భూములు కేటాయించారు. పరిశ్రమకు చెందినవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్‌.టి.రామారావు వెంటనే ఇళ్లు కట్టుకోకపోతే ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకుంటామని హెచ్చరించడంతో ఇప్పటి ఫిల్మ్‌నగర్‌ అభివృద్ధి చెందింది. ఏపీ విడిపోయాక ఇప్పుడు ఏపీ లోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ది చేస్తామని అంటున్నారు. ఇటీవల సిఎం జగన్‌ను కలసిన వారు విశాఖలో భూముల ప్రస్తావన తెచ్చారు. వారంతా […]వివరాలు ...