జాతీయం

ఏ పార్టీ నోట చూసినా నేడు హిందూ మాటలూ, మంత్రాలే

భూమిపుత్ర,జాతీయం: దేశంలోని రాజకీయ పార్టీలన్నీ సంతుష్టీకరణ రాజకీయాలకు సై అంటున్న నేపథ్యంలో హిందూ మత భావనల పాట ను పార్టీలు నెత్తికెత్తుకోవడంతో అయోమయంలో పడటం ప్రజల వంతైంది. భారతీయ జనతాపార్టీ ఒక సైద్దాంతిక అజెండాను ముందు పెట్టి అన్ని పార్టీలనూ ఆ ముగ్గులోకి లాగుతోంది. తన కేంద్ర స్థానమైన తామర కొలనులోకి తామరతంపరగా నేతలను లాగేసుకుంటోంది. ఇంతవరకూ గంపగుత్తగా పడే మైనారిటీ ఓట్లను నమ్ముకుంటే చాలనుకున్న రాజకీయ పక్షాలు తమ పంథా మార్చుకుంటున్నాయి. మెజార్టీ ఓటర్లు కమలం […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ధరల మంటలతో సామాన్యుడి జీవితాలు ఆవిరి

భూమిపుత్ర , బ్యూరో : దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల హద్దు మీరిపోయి ఆందోళనకరమైన స్థాయికి చేరుకున్నట్టు ప్రముఖ ఆర్థిక నిఘా సంస్థ మూడీస్‌ ఎనలిటిక్స్‌ మంగళవారం నాడు వెల్లడించిన సమాచారం ఎవరినీ ఆశ్చర్యానికి గురి చేయదు. చేతి గడియారాన్ని అద్దంలో చూసుకోవసిన పని లేదు. ఏడాదికి పైగా కరోనా వ్యాప్తి, మాసాల తరబడి సాగిన సంపూర్ణ లాక్‌డౌన్‌ నిరుద్యోగాన్ని పెంచి ప్రజల కొనుగోలు శక్తిని హరించి వేశాయి. ఈ నేపథ్యంలో డిమాండ్‌ తగ్గి, సరకు ధరలు […]వివరాలు ...

రాయలసీమ

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో ఎవరి బలమెంత?

భూమిపుత్ర, తిరుపతి: 2019 పార్లమెంటు ఎన్నికలో తిరుపతి స్థానం నుండి గెలిచిన వై ఎస్‌ ఆర్‌ సి పి అభ్యర్థి దుర్గాప్రసాద్‌ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఉప ఎన్నికలో వై ఎస్‌ ఆర్‌ సి పి నుండి గురుమూర్తి అనే ఫిజియోథెరపిస్ట్‌ పోటీపడుతుండగా, టిడిపి నుండి మాజీ కేంద్ర మంత్రి పనబాక క్ష్మి పోటీ చేస్తున్నారు. బిజెపి జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ రత్నప్రభ పోటీ చేస్తున్నారు. వీరి […]వివరాలు ...

జాతీయం

మావోయిస్టు వ్యూహకర్త హిడ్మానే లక్ష్యంగా భద్రతా బలగాల పావులు

భూమిపుత్ర, రాయ్‌ పూర్: సుదీర్ఘ కాలం తర్వాత అంబుష్‌ అటాక్‌తో ఏకంగా 24 మంది భద్రతా దళాల సిబ్బందిని పొట్టనపెట్టుకున్న చత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల హింసోన్మాదం ఇపుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మావోయిస్టులు దాదాపు అంతమయ్యారని అందరూ భావిస్తున్న తరుణంలో తమ ఉనికిని చాటుకోవడమే కాకుండా భద్రతా బలగాలు ఉలిక్కి పడేలా చేసిన తెర్రం దాడిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హోం మంత్రి అమిత్‌ షా.. ఈ దాడికి తెగబడిన మావోయిస్టులకు బుద్ది చెబుతామని […]వివరాలు ...

జాతీయం

భారతీయ సామాజిక దార్శనికుడు డా.బాబూ జగ్జీవ న్ రామ్

భూమిపుత్ర,జాతీయం: “కొలిమి జ్వాలల్లో వన్నెదేలిన బంగారంలా ఎదిగిన జగ్జీవన్ రామ్ పట్ల నా ‘ఆత్మ’ గౌరవాభిమానాలతో ఉప్పొంగుతున్నది. జగ్జీవన్ రామ్ ‘అమూల్య రత్నం’ – గాంధీ ఓ బాపూజీ మన ‘బాబూజీ’ని గురించి రాసుకున్న మాటలివి. నవభారత నిర్మాణానికి నాంది పలికిన అగ్రశ్రేణి జాతీయ నాయకులలో డా. బాబూ జగ్జీవన్ రామ్ ఎంత ముఖ్యుడన్నది ఆయన మాటల్లోని సారాంశం తెలియజేస్తుంది. పిన్న వయసులోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. బానిసత్వ సంకెళ్ళ నుంచి భారత దేశ […]వివరాలు ...

క్రీడలు

ఐపీఎల్‌పై కరోనా పడగ !!

భూమిపుత్ర,క్రీడలు: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది.. కరోనా ఫస్ట్‌ వేవ్‌ కంటే తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే ప్రస్తుత పరిస్థితి కొనసాగుతోంది. ప్రజ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతగా హెచ్చరించినా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మనకేమవుతుందిలే అన్న ధోరణితో దేశంలో డేంజర్‌ బెల్స్‌ మ్రోగుతున్నాయి. ఫస్ట్‌ వేవ్‌లో కేసులు భారీ సంఖ్యలో నమోదు అయినా.. లక్ష దాటింది లేదు.. కానీ, ఆ రికార్డును బ్రేక్‌ చేసిన సెకండ్‌ వేవ్‌… కొత్త రికార్డును సృష్టిస్తూ.. లక్షకు […]వివరాలు ...

సంపాదకీయం

ప్రజల నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తోందా!!

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా వ్యాప్తి కి ప్రధానంగా ప్రజల నిర్లక్ష్యమే కారణమని గతేడాదిగా జరుగుతున్న పరిణమాలను బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . ఏడాదయినా ప్రజలు జాగరూకతలను పాటించడం లేదు . పోలీసులు ఫైన్ వేస్తామని హెచ్చరించడం లేదా లాఠీ ఝళిపించడం చేయాల్సి వస్తోంది . చలానా విధిస్తారన్న భయం లేకుండా పోతోంది . తాజా కేసులు చూస్తుంటే కరోనా ఉధృతి మరోమారు తీవ్రంగా ఉంది . వ్యాక్సిన్ వచ్చినా ఫ్రీగా వేస్తున్నా కూడా ప్రజల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు […]వివరాలు ...

సాహిత్యం

డా. అంబేద్కర్ జాతీయ పురస్కార గ్రహీత ఆచార్య ‘దార్ల’తో ఇంటర్వ్యూ

 భూమిపుత్ర  శ్రీహరి మూర్తి (శ్రీహరి): భారతీయ దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు ప్రదానం చేసిన ‘డా.అంబేద్కర్ జాతీయ పురస్కారం’ స్వీకరించిన సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు. ఇంతకు ముందు అందుకున్న పురస్కారాల కన్నా దీన్ని అందుకోవడం పట్ల ఏమైనా ప్రత్యేకత ఉన్నట్లు భావిస్తున్నారా? ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు (దార్ల): మీ శుభాకాంక్షలను నా ధన్యవాదాలు. నిజానికి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుండి నేను కొన్ని పురస్కారాలను స్వీకరించినా, ఇది నా కుటుంబం అందిస్తున్న పురస్కారంగా భావిస్తున్నాను. నేనెంతో […]వివరాలు ...

అభిప్రాయాలు

భూమిపుత్ర దినపత్రిక – సాంస్కృతిక చైతన్య పుత్రిక

సాకే శ్రీహరి మూర్తి  అంకితభావం గల పాత్రికేయుడు మాత్రమే కాదు, ఆయన అంతకుమించి పర్యావరణ ప్రేమికుడు.రాయలసీమ జాగృతి మాస పత్రికను నడిపేవారు. దానికి ఐ.ఎస్.ఎస్.ఎన్ నెంబర్ కూడా ఉంది. దానిలో అనేకమంది పరిశోధక విద్యార్థులు, ప్రొఫెసర్స్, రచయితలు మంచి మంచి వ్యాసాలు రాశారు. జాగృతి మాస పత్రికలో రాయలసీమ కు సంబంధించిన చారిత్రక వాస్తవాలను దృశ్యాత్మక కథనాలతో ఎంతో అద్భుతంగా ప్రచురించేవారు. ఒక వ్యాసాన్ని వేస్తే దానికి సంబంధించిన అరుదైన ఫోటోలను సేకరించి వేయడం ఆ పత్రికలో […]వివరాలు ...

జాతీయం

బెంగాల్‌, తమిళనాడుల్లో నూ ఇంటింటికీ రేషన్‌

భూమిపుత్ర,న్యూ ఢిల్లీ: ప్రతి రాష్ట్రంలో రేషన్‌ అనేది ఓటర్లను ఆకట్టుకునే ప్రధాన అస్త్రం. అయితే త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేస్తున్న పథకాలను తమ హామీల్లో ఇతర రాష్ట్రాల పార్టీ నేతలు గుప్పించడం విశేషంగా కన్పిస్తుంది. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు. అనేక ఉచిత పథకాలతో సహా రేషన్‌ సరుకులు కూడా తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రాలుగా మలుచుకున్నాయి.ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌ […]వివరాలు ...