ఈ-పేపర్

భూమిపుత్ర ఈ పేపర్ 28 జూలై 2021

ర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై,కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,పెగాసస్ స్పై వేర్ రేపుతున్న సెగలు,పార్లమెంట్ లో ప్రతిష్టంభన వంటి విషయాల సమగ్రమైన సమాచారం మన భూమిపుత్ర దినపత్రికలోవివరాలు ...

సంపాదకీయం

జాతీయ జల విధానం రూపొందించుకోకపోతే జలజగడాలు తప్పవు

భూమిపుత్ర,సంపాదకీయం: వర్షాల ద్వారా మనం పాఠాలు నేర్చుకోవాలి. వరదలను నివారించి, నీటిని నిల్వ చేసుకునే పద్దతలను అవలంబించాలి. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయడంతో మళ్లీ సముద్రంలోకి నీరు చేరుతోంది. ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో దేశంలో నీటి యాజమాన్యం సరిగా లేదని ఏటా కురుస్తున్న వర్షాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికితోడు అనేక జలాశయాల్లో పూడిక పేరుకుని పోతోంది. ఏటేటా వర్షాలతో ఒండ్రు చేరుతోందని నిపుణులు […]వివరాలు ...

తెలంగాణ

రామప్ప ఆలయానికి ప్రపంచ గుర్తింపు

భూమిపుత్ర,వరంగల్‌: రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వరంగల్‌ రామప్ప ఆలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇంజనీరింగ్‌, శిల్పకళకు నెలవైన రామప్ప ఆలయం ఇక భారత కట్టడం ఎంత మాత్రం కాదని ప్రపంచ స్థాయి కట్టడమంటూ సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌విజ్‌. చైనాలో జరిగిన యూనెస్కో సమావేశం రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను కట్టబెట్టింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ […]వివరాలు ...

సంపాదకీయం

విద్యారంగ సంక్షోభంపై విస్తృత అధ్యయనం జరగాలి !!

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా వైరస్ మూలంగా ప్రైవేట్‌ విద్య గగన కుసుమంగా మారింది. ఆన్‌లైన్‌ విద్యకు కూడా ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. టీచర్లకు జీతాలు చెల్లించకున్నా పైసా ఖర్చు లేకున్నా విద్యార్థులు మాత్రం డబ్బులు చెల్లించకుంటే ఆన్‌లైన్‌ తరగతుల నుంచి లాగిన్‌ కావడానికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల వసూళ్లపై ఆందోళనలు చేస్తున్నా, కోర్టులు మొట్టి కాయలు వేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ దశలో విద్యార్థులకు అండగా ప్రభుత్వాలే నిలవాలి. లక్షలాదిగా ఉన్న […]వివరాలు ...

జాతీయం

తమిళనాట బీజేపీ ఎత్తులు ఫలించేనా!!

భూమిపుత్ర,జాతీయం: చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో తమ రాజకీయ ప్రాబల్యాన్ని విస్తరించుకునేందుకు ప్రణాళికలు రచించే బీజెపి ఇప్పుడు దేశంలో మరో రాష్ట్ర విభజనకు ఎత్తుగడ వేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య విజభన జరిగింది. ఏదో ఒక రూపంలో నిత్యం రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంటోంది. చాపకింద నీరులా బిజెపి తాను చేయాల్సింది చేసుకుంటూ పోతోంది. దక్షిణ తమిళనాడులో రెండో రాజధాని కావాలంటూ డిమాండ్‌ వినిపించినా ఆ వాదనకు పెద్దగా మద్దతు లభించలేదు. తాజాగా అదే తమిళనాడు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

దశ లేని “దిశా” చట్టం!!

భూమిపుత్ర, విజయవాడ: రాజకీయ నాయకులకు ప్రచార ఆర్భాటాలు వెన్నతో పెట్టిన విద్య. దేశంలో చాలా రాష్ట్రాలు కరోనా నుంచి బయటపడ్డాయి. ఏపీకి మాత్రం ఆ వేదన పూర్తిగా తొలగిపోలేదు. కొంచెం తెరపి ఇచ్చింది. పూర్తిగా లాక్‌ డౌన్‌ ఎత్తేయలేదు. అప్పుడే రాజకీయాల్లో గ్యాప్‌ వచ్చేసిందని నాయకులు రంగంలోకి దిగిపోయారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కరోనా బాధితుల పేరుతో సాధన దీక్ష చేశారు. ఇంకోవైపు అమల్లోకి రాని చట్టానికి ఒక యాప్‌ తెచ్చి అదో వింతగా […]వివరాలు ...

రాయలసీమ

జాడే లేని నైరుతి రుతు పవనాలు

భూమిపుత్ర, అనంతపురం: నైరుతి రుతుపవనాలు ముందస్తుగా పలకరించినా తర్వాత ముఖం చాటేశాయి. ఈ విడత కష్టాలు గట్టెక్కినట్లేనని భావిస్తున్న తరుణంలో అన్నదాత ఆశల చుట్టూ మబ్బులు కమ్ముకున్నాయి. ఏటా జూన్‌ 10 నుంచి 12 మధ్య రుతు పవనాలు ప్రవేశిస్తుండగా ఈసారి 4నే రావడంతో ఖరీఫ్‌పై రైతుల ఆశలు చిగురించాయి. ముందస్తు వేరుశనగ, ఇతర పంటల సాగుకు అనువని భావించారు. దుక్కులు చేసుకొని విత్తనాలు, ఎరువులు సమకూర్చుకున్నారు. ఇంతలో నైరుతి నిరుత్సాహ పరచడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. […]వివరాలు ...