రాయలసీమ

ముగ్గురి ప్రాణాలు కాపాడిన దిశ యాప్- ఎస్పీ ఫక్కీరప్ప

భూమిపుత్ర(ఏప్రిల్ 10) కర్నూలు: మహిళల భద్రత, రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ ముగ్గురి ప్రాణాలు కాపాడింది .మొబైల్ లో ఉన్న దిశ యాప్ ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్ కు వెళ్ళిన ఒక సందేశంతో కర్నూలు జిల్లా మహానంది పోలీసులు సత్వరమే స్పందించి బాధితులను రక్షించారు. మహానంది ఎస్ఇ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన సమాచారం మేరకు నంద్యాల మండలం చాపిరేవులకు చెందిన ఎ.ఆదిలక్ష్మి , తన కుమార్తెలు సుప్రియ ( 7 […]వివరాలు ...

సినిమా

సూర్య నూతన చిత్రం పోస్టర్‌ విడుదల

భూమిపుత్ర, సినిమా: కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య కత్తిచేతపట్టిన పోస్టర్‌ ని రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించిన ఓపోస్టర్‌ విడుదలై అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. సూరీడు వెలుగుల్లో కత్తిని పట్టుకొని లుంగీలో ఉన్న సూర్య స్టిల్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పాండిరాజ్‌ డైరక్షన్‌ లో తెరకెక్కుతోన్న ఈసినిమాలో సూర్య ఊరమాస్‌ గా కనిపించబోతున్నాడు. కోలీవుడ్‌ స్టార్‌ సూర్య ఇటీవలే ’సూరారై పొట్రు’ సినిమాతో వచ్చి భారీ హిట్‌ అందుకున్నాడు. […]వివరాలు ...

సినిమా

మహిళలు మెచ్చే చిత్రంగా ’వకీల్‌ సాబ్‌’

మళ్లీ మంచి నటనను అందించిన పవన్‌ కళ్యాణ్‌ భూమిపుత్ర,సినిమా: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మూడేళ్ళ తర్వాత ’వకీల్‌ సాబ్‌’ సినిమాతో తెరపైకి వచ్చాడు. అమితాబ్‌ బచ్చన్‌ హిందీ చిత్రం ’పింక్‌’కు ఇది రీమేక్‌. అయితే… ఇదే సినిమాను ఇప్పటికే అజిత్‌ తమిళంలో ’నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్‌ చేశాడు. పల్లవి (నివేద థామస్‌), జరీనా (అంజలి), దివ్య (అనన్య) వేర్వేరు నేపథ్యాలకు చెందిన మహిళలు. ఈ వర్కింగ్‌ ఉమెన్స్ ముగ్గురూ హైదరాబాద్‌ లోని ఓ ప్లాట్‌ […]వివరాలు ...

తెలంగాణ

ప్రైవేటు పాఠశాలలపై చర్యలకెందుకు మీన మేషాలు?

భూమిపుత్ర,తెలంగాణ: కరోనాతో ప్రైవేట్‌ పాఠశాలల టీచర్ల బతుకులు ఆగమయ్యాయి. ఉన్నత విద్యావంతులుగా ఉంటూ అనేక పాఠశాలల్లో పనిచేస్తున్న లక్షలాది మంది టీచర్లు గత ఏడాదిగా రోడ్డున పడ్డారు. ప్రైవేట్‌ యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసి టీచర్లు, ఇతర సిబ్బందికి మాత్రం జీతాలు ఇవ్వడంలేదు. మధ్యలో స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం ఆదేశించడం తెరిచీ తెరవగానే బకాయిలు వసూలు చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఈ మధ్యలో అమాయకంగా నష్టపోయింది మాత్రం టీచర్లు, సిబ్బంది మాత్రమే. నిజానికి […]వివరాలు ...

సినిమా

సాగరతీరంలో… ’సాహో’ బ్యూటీ!!

భూమిపుత్ర,సినిమా: మాల్దీవ్స్‌… ఇప్పుడు బాలీవుడ్‌ లో ఎవరి నోటా విన్నా ఇదే పర్యాటక కేంద్రం. మన టాలీవుడ్‌ సెలెబ్రిటీలు కూడా ఈ మధ్య కొందరు మాల్దీవ్స్‌ లోనే ప్రత్యక్షమయ్యారు. ఇక ఇప్పుడు అక్కడి సాగర తీరంలో సేద తీరే టైం శ్రద్దా కపూర్‌ కి వచ్చేసింది. మాగ్నిఫిషెంట్‌ బేబ్‌ మాల్దీవ్స్‌ లో మెరిసిపోతోంది! ముంబైలో కరోనా కల్లోం కొనసాగుతుండగా శ్రద్దా మాత్రం మాల్దీవ్స్‌ కు వెళ్లిపోయింది. అక్కడ హాయిగా రిలాక్స్‌ అవుతూ ఇంటర్నెట్‌ లో ఫోటోలు, వీడియోలు […]వివరాలు ...

జాతీయం

మోదీ అసంబద్ధ విధానాలు- మరో సంక్షోభంలో కి జనం

భూమిపుత్ర, సంపాదకీయం: దేశంలో కరోనా రెండవదశ దూసుకుని వస్తోంది. ప్రజల జీవితాలను మళ్లీ అతలాకుతలం చేసే పరిస్థితులు దాపురించాయి. యధావిధిగానే ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిలో ముందుకు సాగుతున్నాయి. ఆయా రాష్ట్రాలు సొంతంగా లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు విధించుకుని కట్టడి చేస్తున్నాయి. మహారాష్ట్రలో మాత్రం అదుపు చేయలేనంతగా కేసులు పెరుగుతున్నా అవినీతిలో మునిగిన మహా ఆగాఢా ప్రభుత్వం కరోనా కట్టడిలో పెద్దగా శ్రద్ద పెట్టడం లేదు. అంతెందుకు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న మోడీ ప్రజల జీవితాలను గట్టెక్కించే ప్రయత్నాలు […]వివరాలు ...

జాతీయం

ఏ పార్టీ నోట చూసినా నేడు హిందూ మాటలూ, మంత్రాలే

భూమిపుత్ర,జాతీయం: దేశంలోని రాజకీయ పార్టీలన్నీ సంతుష్టీకరణ రాజకీయాలకు సై అంటున్న నేపథ్యంలో హిందూ మత భావనల పాట ను పార్టీలు నెత్తికెత్తుకోవడంతో అయోమయంలో పడటం ప్రజల వంతైంది. భారతీయ జనతాపార్టీ ఒక సైద్దాంతిక అజెండాను ముందు పెట్టి అన్ని పార్టీలనూ ఆ ముగ్గులోకి లాగుతోంది. తన కేంద్ర స్థానమైన తామర కొలనులోకి తామరతంపరగా నేతలను లాగేసుకుంటోంది. ఇంతవరకూ గంపగుత్తగా పడే మైనారిటీ ఓట్లను నమ్ముకుంటే చాలనుకున్న రాజకీయ పక్షాలు తమ పంథా మార్చుకుంటున్నాయి. మెజార్టీ ఓటర్లు కమలం […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ధరల మంటలతో సామాన్యుడి జీవితాలు ఆవిరి

భూమిపుత్ర , బ్యూరో : దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల హద్దు మీరిపోయి ఆందోళనకరమైన స్థాయికి చేరుకున్నట్టు ప్రముఖ ఆర్థిక నిఘా సంస్థ మూడీస్‌ ఎనలిటిక్స్‌ మంగళవారం నాడు వెల్లడించిన సమాచారం ఎవరినీ ఆశ్చర్యానికి గురి చేయదు. చేతి గడియారాన్ని అద్దంలో చూసుకోవసిన పని లేదు. ఏడాదికి పైగా కరోనా వ్యాప్తి, మాసాల తరబడి సాగిన సంపూర్ణ లాక్‌డౌన్‌ నిరుద్యోగాన్ని పెంచి ప్రజల కొనుగోలు శక్తిని హరించి వేశాయి. ఈ నేపథ్యంలో డిమాండ్‌ తగ్గి, సరకు ధరలు […]వివరాలు ...

రాయలసీమ

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో ఎవరి బలమెంత?

భూమిపుత్ర, తిరుపతి: 2019 పార్లమెంటు ఎన్నికలో తిరుపతి స్థానం నుండి గెలిచిన వై ఎస్‌ ఆర్‌ సి పి అభ్యర్థి దుర్గాప్రసాద్‌ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఉప ఎన్నికలో వై ఎస్‌ ఆర్‌ సి పి నుండి గురుమూర్తి అనే ఫిజియోథెరపిస్ట్‌ పోటీపడుతుండగా, టిడిపి నుండి మాజీ కేంద్ర మంత్రి పనబాక క్ష్మి పోటీ చేస్తున్నారు. బిజెపి జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ రత్నప్రభ పోటీ చేస్తున్నారు. వీరి […]వివరాలు ...

జాతీయం

మావోయిస్టు వ్యూహకర్త హిడ్మానే లక్ష్యంగా భద్రతా బలగాల పావులు

భూమిపుత్ర, రాయ్‌ పూర్: సుదీర్ఘ కాలం తర్వాత అంబుష్‌ అటాక్‌తో ఏకంగా 24 మంది భద్రతా దళాల సిబ్బందిని పొట్టనపెట్టుకున్న చత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల హింసోన్మాదం ఇపుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మావోయిస్టులు దాదాపు అంతమయ్యారని అందరూ భావిస్తున్న తరుణంలో తమ ఉనికిని చాటుకోవడమే కాకుండా భద్రతా బలగాలు ఉలిక్కి పడేలా చేసిన తెర్రం దాడిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హోం మంత్రి అమిత్‌ షా.. ఈ దాడికి తెగబడిన మావోయిస్టులకు బుద్ది చెబుతామని […]వివరాలు ...