సంపాదకీయం

మమత మంత్రాంగం సఫలీకృతమయ్యేనా!!

భూమిపుత్ర,సంపాదకీయం: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహత విజయం మమతా బెనర్జీ అంచనాలను పెంచింది. ఆ గెలుపు ఆమెను ప్రధాని పీఠంపై కన్నేసేలా చేసింది. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి అసలు సిసలు ప్రత్యర్థి తానే అని భావిస్తున్నారామె. ఆ భావనను ప్రజలలో స్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు, మొదట కాంగ్రెస్‌ పై పైచేయి సాధించాలని చూస్తున్నారు. అందుకే హస్తం పార్టీ అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు. పొరుగున ఉన్న ఈశాన్య భారతం టార్గెట్‌గా కాంగ్రెస్‌ని ఖాళీ చేయిస్తున్నారు. […]వివరాలు ...

సంపాదకీయం

ప్రహసనంగా పరిణమిస్తున్న పార్లమెంట్ సమావేశాలు!!

భూమిపుత్ర,సంపాదకీయం : దేశం అనేకానేక సమస్యలతో సతమతమవుతోంది. ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ ఆందోళన చెందుతున్నారు. కరోనా థర్డ్‌వేవ్‌ రూపంలో ఒమిక్రాన్‌ భయపెడుతోంది. నిరుద్యోగులు ఉద్యోగమెలా అని ఎదురుచూస్తున్నారు. ధరలు స్వారీ చేస్తున్నాయి. ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయి. ఔషధ ధరలు రెట్టింపు అయ్యాయి. రూపాయి బేలగా చూస్తోంది. ఏ ఒక్క ఆసరా దొరికినా చాలు ..అన్నచందంగా ప్రజలు ఆశగా చూస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో ప్రజల సమస్యలను నెత్తికెత్తుకోవాల్సిన మన నేతలు ఎప్పటిలాగే పార్లమెంట్‌ సమావేశాల్లో తమ […]వివరాలు ...

జాతీయం

చర్చ లేకుండానే సాగుచట్టాల రద్దు

సభ్యలు గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం చర్చకు కాంగ్రెస్‌ పట్టుబట్టినా పట్టించుకోని స్పీకర్‌ ఓం బిర్లా భూమిపుత్ర,న్యూఢిల్లీ: సోమవారం ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాల తొలిరోజే వివాదాస్పద సాగుచట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌ సభ్యుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఈ బిల్లుపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. దీనిపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందిస్తూ, […]వివరాలు ...

ఆధ్యాత్మికం

రామానుజాచార్యుల చర్యలతో స్థిరంగా పూజాదికాలు

భూమిపుత్ర,ఆధ్యాత్మికం: శ్రీ భాష్యకారుడై, విశిష్టాద్వైత సిద్దాంతాన్ని స్థిరముగ నిలిపిన ధీశాలి రామానుజులవారు. కలియుగంలో వేంకటేశుడే గతి అని చాటిన గురువు ఆయన. కొండను ఆదిశేషుడని భావించి మోకాలుతోటే కొండనెక్కిన భక్తి పరుడు. కేవలం మనకే కాక శంఖ చక్రా క్రియాది కార్యాలను స్వామికి చేసి ఆచార్యుడంటే ఇతనే అని అనిపించుకున్న వారు ఆయన. స్వామికి ఊర్ధ్వపుండ్రమును ధరింపజేసి లోకానికి ఆయన శోభను ప్రకాశింపజేసాడు. వేంకటేశ్వరుడిని లోకానికి ప్రకటింపజేసి అక్కడ ఆలయ నిర్వహణను చక్కపరిచారు భగవత్‌ రామానుజులవారు. కొండపై పూలు […]వివరాలు ...

Uncategorized

పదవుల పటాటోపమే కానీ ప్రయోజనం శూన్యం

భూమిపుత్ర,అమరావతి: రాజకీయాల్లో నాయకులు ప్రధానంగా ఈ కిరీటాలనే కోరుకోవడం సహజం. చేతిలో పదవి ఉంటే పట్టుకుని ఊరేగవచ్చు. ఇది నేటి రాజకీయాల్లో వెలుగొందుతున్న వాస్తవం. ఇలాంటి రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే ఎరిక్‌ ఫ్రామ్‌ అనే సామాజిక శాస్త్రవేత్త “అధికార వాంఛ బలం నుంచి కాక బలహీనత నుంచి ఉద్భవిస్తుంది…’’ అని వ్యాఖ్యానిస్తారు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గడచిన రెండున్నరేళ్లలో పలు నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయడంతో ఆ పార్టీలో దాదాపు చోటా, మోటా […]వివరాలు ...

సంపాదకీయం

ఈశాన్య రాష్ట్రాలలో కనుమరుగవుతున్న కాంగ్రెస్!!

భూమిపుత్ర,సంపాదకీయం: మూలిగే నక్కపై తాటి పండు పడటం అంటే ఇదే. కాంగ్రెస్‌కు దెబ్బ విూద దెబ్బ. అసలే దాని పరిస్థితి బాగా లేదు. దేశంలో ఎన్నడూ లేనంతగా బలహీన పడింది. తొలి నుంచి ఈశాన్య భారతం కాంగ్రెస్‌కు పెట్టని కోట. కానీ ఇప్పుడు అక్కడ ఖాళీ అవుతోంది. బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం మేఘాలయ కూడా చేయి దాటి పోయింది. దాంతో ఈశాన్య రాష్ట్రాలలో హస్తం పని అయిపోయింది అనే భావన కలిగిస్తోంది.మేఘాలయలో 17 మంది కాంగ్రెస్‌ […]వివరాలు ...

రాయలసీమ

నీటిశోభతో సోయగాలొలికిస్తున్న చెరువులు

భూమిపుత్ర,అనంతపురము: అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండి నీటి శోభతో సోయగాలొలికిస్తున్నాయి. కొన్ని దశాబ్ధాల తరువాత మిడ్‌ పెన్నార్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యంతో నిండటంతో జలకళ సంతరించుకుంది. పెన్నా నదిపై ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పటికీ హెచ్‌ఎల్సి మొదటి దశ కింద గార్లదిన్నె మండలంలోని పెనకచెర్ల వద్ద 1963లో నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే డ్యామ్‌ పూర్తి స్థాయి సామర్థ్యంతో నిండి పొంగిపొర్లింది. ఆ తరువాత నుంచి […]వివరాలు ...