సేద్యం

అనంత లో మూడింట ఒక వంతు వేరుశనగ క్వింటాళ్లు పంపిణీ

భూమిపుత్ర,అనంతపురం: ఖరీఫ్‌లో రైతులకు పంపిణీ కోసం ప్రభుత్వం సేకరించి సిద్ధంగా పెట్టుకున్న సబ్సిడీ వేరుశనగ విత్తనాల్లో దాదాపు మూడింట ఒక వంతు (33 శాతం) అమ్మకం అయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. సుమారు లక్షన్నర క్వింటాళ్ల వరకు మిగిలిపోతాయని అంచనాకొచ్చారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే లక్ష క్వింటాళ్లకుపైన మిగులుతాయంటున్నారు. సీడ్‌ను ఎలాగైనా సేల్‌ చేయించేందుకు పంపిణీ గడువును దశలవారీగా పెంచుతూ వచ్చారు. చివరిగా ఈ నెలాఖరును వ్యవధిగా నిర్ణయించారు. ఖరీఫ్‌లో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో నాలుగున్నర లక్షల […]వివరాలు ...

జాతీయం

జమ్మూ కాశ్మీర్ కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా!!

ప్రధాని నివాసంలో జమ్మూ కాశ్మీర్‌ నేతలు సమావేశానికి హాజరైన నలుగురు మాజీ సిఎంలు భూమిపుత్ర, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ నేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీ లోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జమ్మూ కశ్మీర్‌కు చెందిన నలుగురు మాజీ మఖ్యమంత్రులు ఫారూఖ్‌ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్‌, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా మరో 10 మంది నేతలు హాజరు అయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం నాటి నుంచి కశ్మీర్‌లో […]వివరాలు ...

చదువు

ఇంటర్‌పరీక్షల పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

భూమిపుత్ర, న్యూఢిల్లీ: ఇంటర్ పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటువ్యాఖ్యలు చేసింది. 12వ తరగతి పరీక్షలను ఆ రాష్ట్రం ఇప్పటి వరకు రద్దు చేయలేదు. పరీక్షలను నిర్వహిస్తామని కోర్టులో ఏపీ ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యింది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే, దాని వల్ల ఒక్కరు మరణించినా.. కోటి పరిహారం ఇవ్వాలని కోర్టు తన తీర్పులో హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాలు ఇలాంటి నిబంధన పాటిస్తున్నట్లు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

పట్టాలకెక్కని కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం

ప్రతిపాదనల దశల్లోనే కాలయాపన భూమిపుత్ర,నెల్లూరు: కోర్టు కేసుల నుంచి కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి గతేడాది మార్గం సుగమమైనా దీని నిర్మాణంపై ఇప్పటికీ స్పష్టత రావడంలేదు. దీంతో తాజాగా అంచనాలు తయారు చేసి రూ.58 కోట్లు అవసరమంటూ కలెక్టర్‌ చక్రధర్‌బాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎట్టకేలకు నూతన పరిపాలన కేంద్రం తథ్యమని అందరూ భావించారు. కానీ నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు రాలేదు. ఎప్పటికి అనుమతులు వస్తాయో.. అసలు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి […]వివరాలు ...

సేద్యం

ధాన్యం సేకరణే అసలు సమస్య !!

భూమిపుత్ర,వ్యవసాయం: కొందరు కారణ జన్ములు ఉంటారు. ప్రజల కోసం నిరంతరం తపించే పాలకులు పుడుతారు. మనం పాలన చేసేది ప్రజలకోసమే అన్న ఆలోచనతో ముందుకు సాగుతారు. అందుకు అనుగుణంగా పథకాలు రచిస్తారు. తమ ఆలోచనలు కార్యారూపం దాల్చేలా చేస్తారు. తన ఆలోచనలనకు పదనుపెట్టి ముందుకు నడిచి దానిని సాకారం చేసి జనం నోళ్లల్లో నానుతారు. ఔరా ఎంత మంచి నాయకుడని అనిపించుకుంటారు. పాతతరంలో నాయకులు అలానే చేసే వారు. ఎంతో త్యాగబుద్దితో ముందుకు సాగేవారు. తమ సర్వస్వం […]వివరాలు ...

ఆరోగ్యం

డెల్టా ప్లస్‌ వేరియంట్‌కు మహారాష్ట్రలోనే బీజం

భూమిపుత్ర, ఆరోగ్యం: కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ డెల్టా ప్లస్‌ కోవిడ్‌ వేరియంట్‌ భారత్‌ లో కోవిడ్‌ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇది మన దేశంలో నాలుగు రాష్ట్రాలకు విస్తరించింది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌, కర్ణాటకలో ఈ వేరియంట్‌ విస్తరించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించగా మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటివరకు 21 డెల్టాప్లస్‌ కేసులను గుర్తించారు. ఈ వేరియంట్‌తోనే ఇప్పుడు అక్కడ మూడోముప్పు పొంచి ఉందని ఆరోగ్యశాఖ […]వివరాలు ...

క్రీడలు

కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం

ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియామకం భూమిపుత్ర, న్యూఢిల్లీ: ఆంధ్రా ఆణిముత్యం కరణం మళ్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరిని నియమిస్తూ ఆప్‌ సర్కార్‌ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ లో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి వైస్‌ ఛాన్సలర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రఖ్యాత వెయిట్‌ లిప్టర్‌, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమిస్తూ… ఢిల్లీ లోని అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రభుత్వం […]వివరాలు ...

సంపాదకీయం

కరోనాతో పర్యావరణానికి ముప్పే!!

భూమిపుత్ర, సంపాదకీయం: కరోనాతో ప్లాస్టిక్‌ వాడకం కూడా పెరిగింది. కేన్సర్‌ వ్యాధి వ్యాప్తికి, వాతావరణం కాలుష్యానికి కారణమౌతున్న ప్లాస్టిక్‌పై ప్రభుత్వం నిషేధం విధించినా వాడకం మాత్రం ఆగడం లేదు. ఆస్పత్రుల్లో వ్యర్థాలు పెరిగాయి. ఇళ్లలో ప్లాస్టిక్‌ వాడకాలు పెరగడంతో గ్రామాల్లో కాలువల్లో కుప్పలుగా ప్లాస్టిక్‌ పేరుకుని పోతున్నది. కాలుష్య నివారణకు ప్రభుత్వాలు ఇన్నేళ్లుగా తీసుకున్న చర్యల కన్నా కరోనా హెచ్చరికలతోనే సత్ఫలితాలు వచ్చాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కాలుష్యం తగ్గింది. నదీనదాలు స్వచ్ఛంగా కనిపించాయి. మొత్తంగా కరోనాతో […]వివరాలు ...

చదువు

ఫీజుల దోపిడీకి కళ్ళెం వేయాలి!!

భూమిపుత్ర,తెలంగాణ/ఆంధ్రప్రదేశ్‌: విద్యా,వైద్యరంగాలను అభివృద్ది చేసుకోవాల్సిన ఆవశ్యకతను కరోనా సందర్భంగా మరోమారు పరిస్థితులు రుజువు చేశాయి. అదే సమయంలో ప్రైవేట్‌ ఆసుపత్రులపైనా, విద్యాసంస్థలపైనా అజమాయిషీ ఉండాలని, వారి దోపిడీపై దృష్టి పెట్టాలన్న అవసరాన్ని కూడా సూచించింది. కోర్టులు కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని పదేపదే చెబుతూ వచ్చాయి. ఈ యేడాది ఇంకా విద్యాసంవత్సరం ప్రారంభం కాలేదు. జూలై 1నుంచి విద్యాసంవత్సరం ప్రాంభించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. అయినా ప్రైవేట్‌ పాఠశాలలు మాత్రం తమ […]వివరాలు ...