ప్రపంచం

భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్‌కు పులిట్జర్‌ అవార్డు

భూమిపుత్ర, ప్రపంచం: ప్రతిష్టాత్మక పులిట్జర్‌ పురస్కారాన్ని భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్‌ దక్కించుకున్నారు. అమెరికాలో వార్తాపత్రిక, పత్రికా ఆన్‌లైన్‌ జర్నలిజం, సాహిత్యం, సంగీత కూర్పులలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మేఘ రాజగోపాలన్‌ మరో ఇద్దరితో కలిసి గెలుచుకున్నారు. మేఘ రాజగోపాలన్‌ పరిశోధాత్మక కథనం, అంతర్జాతీయ రిపోర్టింగ్‌ విభాగంలో పులిట్జర్‌ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 2017 లో, జిన్జియాంగ్‌లో చైనా వేలాది మంది ముస్లింలను నిర్బంధించేందుకు డ్రాగన్‌ రహస్యంగా నిర్మించిన జైళ్లు, సామూహిక నిర్బంధ […]వివరాలు ...

సాంకేతికం

డిజిటల్‌ ఎకానవిూ ఆశలు గల్లంతేనా ?

భూమిపుత్ర,సాంకేతికం: దేశంలో ప్రజలకు , ప్రభుత్వానికి మధ్య టామ్‌ అండ్‌ జెర్రీ గేమ్‌ నడుస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదు. వారు అందించే సాయం పూర్తిగా తమకు దక్కుతుందనీ భావించడం లేదు. పేద వర్గాల సంగతి పక్కన పెడితే మధ్యతరగతి ప్రజలు తమ ఏర్పాట్లు తాము చేసుకుంటున్నారు. గడచిన ఏడాది కాలంగా నగదు చెలామణి విపరీతంగా పెరిగినట్లు రిజర్వ్‌ బ్యాంకు అధ్యయనం వెల్లడిస్తోంది. బ్యాంకుల నుంచి తీసి మరీ ప్రజలు సొమ్మును […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ ది స్వయంకృతమా!!

భూమిపుత్ర, గుంటూరు: ఎవరైనా ఏదైనా వస్తువులు దాచి పెట్టాలని అనుకున్నారంటే అది ఖచ్చితంగా అనుమానాస్పదం అయిందే అయి ఉంటుందనేది పోలీసులకు నేర్పే ప్రాధమిక పాఠాల్లో ఒకటి. ఇది ఐపీఎస్‌లకు తెలీదని అనుకోవడానికి లేదు. తెలుసు మరి ఐపీఎస్‌లకే అలాంటి పరిస్థితి వచ్చినపుడు భిన్నంగా వ్యవహరించకుండా సాధారణమైన వ్యక్తుల్లానే ప్రవర్తిస్తారని ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ నిరూపించారు. ఆయన హిందూమతానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల వీడియోలను తన క్రైస్తవం గురించి చెప్పిన వీడియోలను సోషల్‌ విూడియా […]వివరాలు ...

జాతీయం

కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలపై జిఎస్టీ తగ్గింపు

కౌన్సిల్‌ సమావేశానంతరం వెల్లడించిన నిర్మలా సీతారామన్‌ భూమిపుత్ర,న్యూ‌ ఢిల్లీ: కరోనా పై పోరాటంలో భాగంగా వినియోగిస్తున్న ఔషధాలు, కొన్ని ఆస్పత్రి పరికరాలు, ఇతర వస్తువులపై కేంద్రం పన్నును తగ్గించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో శనివారం 44వ జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం జరిగింది. కరోనా టీకాలు, బ్లాక్‌ ఫంగస్‌ మందులు, మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సీవిూటర్లు, శానిటైజరు, ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, ఉష్ణోగ్రతలు కొలిచే పరికరాలపై పన్నులు తగ్గించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. […]వివరాలు ...

తెలంగాణ

ఈటల రాజీనామా ఆమోదం

వేడెక్కనున్న హుజురాబాద్ రాజకీయం తెలంగాణా రాష్ట్రంలో తొలిసారి ఎమ్మెల్యే రాజీనామా భూమిపుత్ర,హైదరాబాద్‌ : మాజీమంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ శనివారం ఉదయం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌ కార్యాలయంలో సమర్పించారు. ఆ సమయంలో స్పీకర్‌ అక్కడ లేరు. అయితే రాజీనామా చేసిన తరవాత వెంటనే ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ కార్యాలయం ప్రకటించింది. రాజీనామా లేఖను ఆమోదిస్తూ స్పీకర్‌ నిర్ణయం […]వివరాలు ...

సంపాదకీయం

కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కలేనా?

భూమిపుత్ర,సంపాదకీయం: కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్య మళ్లీ పుండులా సలుపుతోంది. రాహుల్‌ను పీఠంపై కూర్చోబెట్టేందుకు సోనియా చేస్తున్న ప్రయత్నాలను సీనియర్లు అంగీకరించడం లేదని తాజా ఘటనలను బట్టి అర్థం అవు తోంది. రాహుల్‌ కూడా నాయకత్వ పటిమను ప్రదర్శించలేకపోతున్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న పెట్రో దరలపై కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చినా పెద్దగా స్పందన రాలేదు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకుని రావడంతో పాటు, ప్రజా సమస్యలపై పోరాడడంలోనూ కాంగ్రెస్‌ వైఫల్యం కారణంగా మోడీ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. తనకు ఎదురులేనట్లుగా పాలన […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళంలో కదం తొక్కిన కార్మిక సంఘాలు

కేంద్ర ప్రభుత్వ విధానాలను సమీక్షించాలి భూమిపుత్ర, శ్రీకాకుళం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ఎండగడుతూ దేశవ్యాప్త నిరసనోద్యమంలో భాగంగా గురువారం శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు మెడలో వేసుకుని నిరసన చేపట్టారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులకు, రైతులకు, ప్రజలకు తీవ్రమైన నష్టం కలిగించే విధానాలని అమలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత పూర్తిగా కార్పొరేట్‌ శక్తులకు ప్రభుత్వరంగాన్ని […]వివరాలు ...

జాతీయం

ముంబయిలో వర్షాలకు నేలకూలిన భవనం

11మంది అక్కడిక్కడే మృతి భూమిపుత్ర ,ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో విషాదం చోటు చేసుకున్నది. మలాడ్‌ వెస్ట్‌ ప్రాంతంలోని న్యూకలెక్టర్‌ కాంపౌండ్‌లో బుధవారం రాత్రి ఓ నివాస భవనం కూలిపోయింది. ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో మంది ఎనిమిది గాయపడగా.. వారిని దవాఖానాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మహిళలు, పిల్లలు సహా మరో 15 మందిని రక్షించి ఇతర సురక్షిత ప్రాంతాలకు […]వివరాలు ...

సంపాదకీయం

నిరుద్యోగ సమస్య పై తక్షణ కార్యాచరణ కావాలి

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా ప్రమాద ఘంటికలు ఇప్పట్లో వదిలేలా లేవు. దేశంలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాల్సి ఉంది. ప్రజలందరికి వందశాతం వ్యాక్సిన్‌ పూర్తి కావాలి. అలాగే కరోనా వైరస్‌ మ్యుటేషన్లు పూర్తిగా ఆగిపోవాలి. అప్పుడే దీని పీడ విరగడ అయ్యేలా లేదు. ఇకపోతే ఆయా రాష్ట్రాలు మెల్లగా లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్నాయి. ఈ దశలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. బయట మార్కెట్లో కరోనా ఫ్రీగా అంటుతోంది. అప్రయత్నంగానే అది మనలను, మన కుటుంబాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే […]వివరాలు ...