జాతీయ మానవ హక్కుల ఛైర్మన్ ఛైర్మన్‌గా అరుణ్‌ మిశ్రా

 జాతీయ మానవ హక్కుల ఛైర్మన్ ఛైర్మన్‌గా అరుణ్‌ మిశ్రా

భూమిపుత్ర,న్యూఢిల్లీ:

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా(ఎన్‌హెచ్‌ఆర్సీ) బాధ్యతలు స్వీకరించారు. మాజీ జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు పదవీకాలం ముగిసిన తర్వాత, ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ పోస్టు గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఖాళీగా ఉన్నది. బుధవారం జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాతో పాటు ఓ ప్యానెల్‌ సభ్యుడు కూడా చేరారు. అయితే అరుణ్‌ మిశ్రాను మోదీ నేతృత్వంలోని హై పవర్డ్‌ కమిటీ రాష్ట్రపతికి రికమెండ్‌ చేసింది. ఆ హైపవర్డ్‌ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌ షా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున్‌ ఖర్గేలు ఉన్నారు. మల్లిఖార్జున్‌ ఖర్గే అరుణ్‌ మిశ్రా నియామకాన్ని తప్పుబట్టారు.షెడ్యూల్డ్‌ కాస్ట్‌ లేదా షెడ్యూల్డ్‌ తెగకు చెందిన వ్యక్తిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

అరుణ్ మిశ్రా 1978 లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.అతి చిన్న వయసులోనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. 1999లో హైకోర్టు జడ్జిగా నియమింపబడ్డారు. తర్వాత ఈయన రాజస్థాన్,కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా సేవలందించారు. ఇతని హయాంలోనే వివాదాస్పదమైన న్యాయమూర్తి లోయా హత్య కేసు,ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసులు విచారణకు వచ్చాయి.జస్టిస్‌ మిశ్రా సుప్రీంకోర్టు జడ్జిగా 2014లో చేరారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆయన రిటైర్‌ అయ్యారు. కోల్‌కతా, రాజస్థాన్‌ హైకోర్టుల్లో ఆయన చీఫ్‌ జస్టిస్‌గా చేశారు. జస్టిస్‌ మిశ్రా తండ్రి హర్‌గోవింద్‌ మిశ్రా మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా చేశారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్‌ దత్తు 2020 డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు. కాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రఫుల్‌ చంద్ర పంత్‌ ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఆర్‌సీ తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *