ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ 21వరకు పొడిగింపు

 ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ 21వరకు పొడిగింపు

భూమిపుత్ర,అమరావతి:

కరోనా విజృంభణ తగ్గకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూను ఈ నెల 21వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. కాగా, ఎపిలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు అదుపులోకి రావట్లేదు. దీనిపై శనివారం రాత్రి ప్రభుత్వం సవిూక్ష సమావేశం నిర్వహించి, రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి సమయంలో కరోనా ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణలో ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరింది. మాస్కులు తప్పనిసరిగా వాడాలని, భౌతికదూరం పాటించాలని పేర్కొంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *