అమరావతి ఎంపి నవనీత్‌ కౌర్‌కు 2 లక్షల జరిమానా

 అమరావతి ఎంపి నవనీత్‌ కౌర్‌కు  2 లక్షల జరిమానా

తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించినట్లు నిర్ధారణ

తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తానని వెల్లడించిన ఎంపి

భూమిపుత్ర, ముంబై:

ప్రముఖ నటి, మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రాణాకు బోంబే హైకోర్టు రూ.2 లక్షలు జరిమానా విధించింది. ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు ఈ చర్య తీసుకుంది. ఆమె విదర్భలోని అమరావతి నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. ఆమె అభ్యర్థిత్వాన్ని మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అడ్సల్‌ సవాల్‌ చేశారు. అమరావతి లోక్‌సభ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి, ఈ స్థానం నుంచి పోటీ చేశారని ఆరోపిస్తూ శివసేన నేత, మాజీ ఎంపీ ఆనంద్‌ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించినట్లు కోర్టు నిర్ధారించింది. దీనిని రద్దు చేస్తూ, రూ.2 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

ఆరు వారాల్లోగా అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఇదిలావుండగా 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో నవనీత్‌ కౌర్‌ సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రాన్ని కూడా గతంలో హైకోర్టు రద్దు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. నవనీత్‌ కౌర్‌ 1986 జనవరి 3న ముంబైలో జన్మించారు. ఆమె తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు పంజాబ్‌కు చెందినవారు. బోంబే హైకోర్టు తన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుపై నవనీత్‌ కౌర్‌ స్పందించారు. భారత దేశ పౌరురాలిగా తాను న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నానని నవనీత్‌ కౌర్‌ తెలిపారు. తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. తనకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందన్నారు.

Related News

1 Comment

  • These kind of people should be debated from politics & any govt schemes should not be provided for their Entair life besides imprisonment & heavy fine. No bail should be allowed.The person who granted the certificate also punished in the same above Way.then only the country will prosper.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *