అజయ్‌దేవగన్ తో కాజల్‌ జోడీ

 అజయ్‌దేవగన్ తో కాజల్‌ జోడీ

భూమిపుత్ర, సినిమా:

బాలీవుడ్‌లో విజయవంతమైన ’సింగం’ సినిమా కోసం అజయ్‌దేవ్‌గన్ తో తొలిసారి జోడీకట్టింది దక్షిణాది సోయగం కాజల్‌ అగర్వాల్‌. పదేళ్ల తర్వాత ఈ కలయిక మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నట్లు సమాచారం. కార్తి కథానాయకుడిగా తమిళంలో విజయవంతమైన ’ఖైదీ’ చిత్రం హిందీలో పునర్నిర్మితమవుతోంది. ఈ రీమేక్‌లో అజయ్‌దేవ్‌గణ్‌ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన నాయికగా కాజల్‌ను ఎంపికచేసినట్లు తెలిసింది. తమిళ వెర్షన్‌లో హీరోయిన్‌ పాత్రకు స్థానం లేదు.అయితే బాలీవుడ్‌ నేటివిటీకి అనుగుణంగా చిత్రబృందం కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. హీరో ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ను జోడించినట్లు చెబుతున్నారు. ఆ సన్నివేశాల్లో అజయ్‌దేవ్‌గణ్‌ భార్యగా కాజల్‌ అగర్వాల్‌ కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్‌ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ఆమె ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలిసింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *