ఏపీ లో కరోనా నియంత్రణకు చర్యలు

 ఏపీ  లో కరోనా నియంత్రణకు చర్యలు

ఏపీ ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ళ నాని

పగటిపూట కర్ఫ్యూ కు ప్రభుత్వ నిర్ణయం
ఉదయం 6నుంచి 12 గంట వరకు మాత్రమే సడలింపు
భూమిపుత్ర ,అమరావతి:
ఏపీ లో పెరుగుతున్న కరోనా కేసులతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వివిధ రాష్ట్రాలు దీనిపై సీరయస్‌గా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కోవిడ్‌ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఉదయం 6 గంట నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చింది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్‌ అమలు కానుంది. రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది. కోవిడ్‌పై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గించడం, బెడ్ల కొరత నివారించేందుకు అవసరమైన చర్యలపై సీఎం చర్చించినట్టు తెలుస్తోంది. చర్చల అనంతరం సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బుధవారం నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. ఉదయం 6 గంట నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇవ్వనున్నారు. 12 గంటల తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఆ సమయంలో 144వ సెక్షన్‌ అమలులో ఉండనుంది. ఈ ఆంక్షలను రెండు వారాల పాటు అమలు చేయనున్నారు. ఏపీలో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే సీఎం జగన్‌ వద్ద కోవిడ్‌పై సుదీర్ఘంగా సమీక్షించామని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. ఆయన విూడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గించడం, బెడ్‌ కొరత నివారించేందుకు అవసరమైన చర్యలపై సీఎంతో చర్చించినట్టు తెలిపారు. అయితే ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ బెడ్స్‌ను కూడా ఉపయోగించుకోవడంతో పాటు ఉదయం 6 నుండి 12 గంటల వరకు మాత్రమే షాపులు పనిచేసేలా చర్యలు తీసుకునే అంశాపై చర్చించామన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ నిర్ణయం బుధవారం నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఏపీకి ఉన్న ఆక్సిజన్‌ కొరతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంపై దృష్టి సారిస్తామని ఆళ్ల నాని వెల్లడించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *